డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

సాధారణంగా చాలా మంది సినీ హీరోలు తమ సినిమాలు పెద్ద హిట్ సాధిస్తే, ఆ సినిమా డైరెక్టర్లకు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా రోజులుగా జరుగుతున్న తంతు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ మరియు నితిన్ వంటి హీరోలు కూడా కార్లను గిఫ్ట్స్ గా అందించిన సంగతి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు విశ్వనటుడు 'కమల్ హాసన్' కూడా విక్రమ్ సినిమా డైరెక్టర్ 'లోకేష్ కనకరాజ్‌'కి అత్యంత ఖరీదైన గిఫ్ట్ అందించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'విక్రమ్' 2022 జూన్ 3న విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత కమల్ హాసన్ సినిమా విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా భారీ కలెక్షన్లను పొందుతూనే ఉంది.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

ఇప్పటికి అందిన సమాచారం విక్రమ్ సినిమా కేవలం నాలుగు రోజుల్లో రూ.125 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. చాలా రోజుల తరువాత గొప్ప హిట్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి, కమల్ హాసన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ (లెక్సస్) కారును అందించి ఆశ్చర్యపరిచాడు. కమల్ హాసన్ గిఫ్ట్ గా అందించిన ఈ లెక్సస్ కారు ధర గరిష్టంగా రూ. 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏ హీరో కూడా ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

కమల్ హాసన్ నటించిన ఈ విక్రమ్ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా గొప్ప విజయం వైపు అడుగులు వేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్‌కి లెక్సస్ లగ్జరీ సెడాన్ మోడల్ ES 300h ని గిఫ్ట్ గా అందించారు. ఈ కారు విషయానికి వస్తే, ఇది ప్రపంచ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్. ఈ లగ్జరీ కారు 2021 అక్టోబర్ నెలలో భారతీయ మార్కెట్లో విడుదలైంది.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

లెక్సస్ ఈఎస్300హెచ్ (Lexus ES300h) అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ లగ్జరీ సెడాన్ ముందు భాగంలో, సిగ్నేచర్ స్పిండిల్ ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్ వంటివి ఉన్నాయి.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

లెక్సస్ ఈఎస్300హెచ్ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో రిక్లైనింగ్ మరియు వెంటిలేటెడ్ రియర్ సీట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కంపెనీ ఇచ్చింది. మొత్తానికి ఇది చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా కిక్ సెన్సార్‌తో పవర్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 17-స్పీకర్ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫయర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 240-వోల్ట్ ఎలక్ట్రిక్ యూనిట్‌తో జత చేయబడింది. ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌గా మారుతుంది. ఈ ఇంజిన్‌తో పాటు బ్యాటరీ గరిష్టంగా 215 బిహెచ్‌పి పవర్ మరియు 221 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

డైరెక్టర్‌కి ఖరీదైన కార్ గిఫ్ట్‌గా అందించిన కమల్ హాసన్: ధర తెలిస్తే ఖచ్చితంగా హవాక్కవుతారు..

భారతదేశంలో లెక్సస్ ఈఎస్300హెచ్ లగ్జరీ కారు బిఎండబ్ల్యు 5 సిరీస్, ఆడి ఏ6, మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్, జాగ్వార్ ఎక్స్ఎఫ్ మరియు వోల్వో ఎస్90 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తం మీద ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2022, 8:30 [IST]
English summary
Kamal haasan gifts director lokesh kanagaraj a lexus es 300h luxury sedan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+