ఎలక్షన్‌కు ముందే కొత్త కారు కొన్న 'కంగనా రనౌత్'.. ధర ఎంతో తెలుసా?

సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమకు ఇష్టమైన కార్లను కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ నటి, ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేసిన 'కంగనా రనౌత్' ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది.

నటి 'కంగనా రనౌత్' (Kangana Ranaut) కొనుగోలు చేసిన ఖరీదైన కారు జర్మన్ బ్రాండ్ అయిన 'మెర్సిడెస్ బెంజ్ జీఎస్ఎస్' (Mercedes Benz GLS). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో తెల్లని దుస్తులతో కంగనా బెంజ్ జీఎస్ఎస్ కారులో కనిపించడం చూడవచ్చు. దీని ధర సుమారు రూ. 2.43 కోట్లు అని తెలుస్తోంది.

Kangana Ranaut Buys Mercedes Benz GLS600

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్600 అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 550 Bhp పవర్ మరియు 2500 rpm వద్ద 730 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్600 సెడాన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ కారు ప్రకాశవంతమైన వర్టికల్ స్లాట్, డ్యూయెల్ టోన్ పెయింట్ థీమ్ కలిగి 22 ఇంచెస్ స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ సెడాన్ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది.

Kangana Ranaut Buys Mercedes Benz GLS600

కంగనా రనౌత్ మాదిరిగానే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. కాగా కంగనా గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఎస్680 (Mercedes Benz S680) కూడా ఉందని తెలుస్తోంది. దీని ధర రూ. 3.6 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అంతే కాకుండా ఆడి కంపెనీకి చెందిన క్యూ3 మరియు బీఎండబ్ల్యు 7 సిరీస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

కంగనా రనౌత్ రాజకీయ రంగ ప్రవేశం..

కంగనా రనౌత్ ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరింది. ఈమె త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందాలంటే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే కంగనాను మండి నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు.

ఇప్పటికే కంగనా రనౌత్ ప్రచారం కూడా నిర్వహించడం ప్రారంభించింది. గత వారంలో మండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు అవకాశం కల్పిస్తే.. మండి ప్రజల గొంతునవుతా, ప్రజల కష్టాలను తప్పకుండా తీరుస్తా అని పేర్కొంది. అయితే ఈ సారి జరగబోయే ఎన్నికల్లో.. ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. దేశంలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఎవరికి వారు ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడానికి సన్నద్ధమవుతున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 10, 2024, 13:51 [IST]
English summary
Kangana ranaut buys mercedes benz gls600 car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+