రూ.32 కోట్లకు ఇల్లు అమ్మి ఖరీదైన కారుని కొన్న బాలీవుడ్ బ్యూటీ, ఫోటోలు వైరల్!
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కాస్త వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. తెలుగులో ఏక్ నిరంజన్‌తో ప్రభాస సరసన నటించి మన్ననలు పొందింది. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లోనే అత్యంత ఫేమ్ సంపాదించిన హీరోయిన్ అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా పాలిటిక్స్‌పై దృష్టి పెట్టింది. తాజాగా ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' (Kangana Ranaut's Emergency Movie) సెన్సార్ బోర్డ్ క్లియర్‌నెన్స్ కోసం వేచి చూస్తుంది.
ఈ బీ-టౌన్ బ్యూటీ కంగనా ఇటీవల ముంబైలోని తన బంగ్లాను అమ్మి మరోసారి వార్తల్లో నిలిచింది. పాలి హిల్ బంగ్లాగా పేరొందిన తన ఇంటిని కంగనా రూ.32 కోట్లకు అమ్మేసింది. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో ఇంటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నానని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సైతం వెల్లడించింది. ఇంత ఖరీదైన బంగ్లాను విక్రయించడం బాలీవుడ్‌లో కొన్ని రోజుల పాటు చర్చనీయాంశంగా మారింది.

2017లో కంగనా పాలి హిల్ బంగ్లాను రూ.20.7 కోట్లకు కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 12 కోట్లు పెరిగింది. అయితే ఆమె ఇంటిని అమ్మిన తర్వాత కొత్త లగ్జరీ కారును కూడా కొనుగోలు చేసింది. కారు కొనుక్కోవడానికి ఇల్లు అమ్మేశారా అని ఆశ్చర్యపోకండి. కారుని కొనుగోలు చేయడానికి వచ్చిన సొమ్ములో కేవలం రూ.3 కోట్లు వెచ్చించి రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది.
ఆమె కొత్త వాహనం కొనుగోలు చేసినట్లు ముంబైలో ల్యాండ్ రోవర్ ప్రముఖ డీలర్‌షిప్ మోడీ మోటార్స్ అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కంగనా రనౌత్‌కి కొత్త ఎస్‌యూవీని అప్పగించిన చిత్రాలను డీలర్‌షిప్ పంచుకున్న కాసేపటికే వైరల్ అయ్యాయి. కంగనా తన కొత్త లగ్జరీ కారు ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన స్టిల్స్‌ని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

'బాలీవుడ్ క్వీన్ మిస్ కంగనా రనౌత్ అద్భుతమైన కొత్త ప్రయాణానికి అభినందనలు' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. కారుని డెలివరీకి తీసుకున్న తర్వాత అల్లుడు అశ్వత్థామను పట్టుకుని కారుకు పూజలు చేస్తున్న దృశ్యాలు ఈ ఫొటోల్లో వైరల్ అవుతున్నాయి. కంగనా కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌ని ఎంచుకుంది.
5 సీట్ల రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB లగ్జరీ ఎస్‌యూవీ ధర ముంబయిలో సుమారు రూ .3.81 కోట్లుగా ఉంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వేరియంట్లలో ఇది ఒకటి కావడం విశేషం. అందుకే ఈ వేరియంట్‌ని సెలబ్రిటీలతో పాటు ప్రముఖులు కొనుగోలు చేస్తున్నారు.
ఈ లగ్జరీ ఎస్‌యూవీలో ఆరు సిలిండర్ల ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజన్ కలదు. ఇది 346 bhp వద్ద 700 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB 3.0 మోడల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ని స్టాండర్డ్‌గా పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది. అంతే కాకుండా ఇది మెరుగైన పనితీరును అందించడానికి వీలు కల్పిస్తుంది.
ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్‌లో సిగ్నేచర్ DRLలతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, హీటెడ్ విండ్ స్క్రీన్, ఎల్ ఈడీ ఫాగ్ లైట్లు, 22 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌లో 13 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, కూల్డ్-హీటెడ్ సిస్టమ్‌తో మసాజ్ సీట్లు, వెనుక ప్రయాణీకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ఇంకా మరెన్నో ఫీచర్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








