ధర రూ.3.5 కోట్ల లగ్జరీ కారులో తళుక్కుమన్న నటి కంగనా రనౌత్.!
బాలీవుడ్ నటీనటుల్లో చాలా మందికి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. వీలు చాలా సందర్భాల్లో అత్యంత ఖరీదైన కార్లలో సందడి చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి కంగనా రనౌత్ (Actress kangana Ranaut) అత్యంత ఖరీదైన లగ్జరీ కారులో తళుక్కుమన్నారు. ఈ వీడియోను కార్స్ ఫర్ యూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసింది.
మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారులో (Mercedes Maybach S680 ) నటి కంగనా రనౌత్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అనంతరం అక్కడున్న కొందరు న్యూ్స్ రిపోర్టర్లు... కొన్ని ఫోటోలు కావాలని కోరడం ఈ వీడియో గమనించవచ్చు. ఇందుకు అంగీకరించిన ఆమె.. అనంతరం వారితో కొద్దిసేపు మాట్లాడి, ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లిపోవడం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

అయితే కంగనా రనౌత్ ప్రయాణించిన కారు మెర్సిడెస్ మే బ్యాక్ S680 (Mercedes cars).. భారత్‌లో అందుబాటులో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి. మెర్సిడెస్ ఉత్పత్తి చేసే అన్ని మేబ్యాక్ కార్లలో.. S680 ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తుంది. ఈ కారు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. కారు ఇంటీరియర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అడ్జస్టబుల్ బటన్ కలిగిన సీట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ప్రయాణికుల వినోదం కోసం మల్టిపుల్ స్క్రీన్లను కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ మెర్సిడెస్ మేబ్యాక్ S680 లగ్జరీ కారు మల్టీజోన్ క్లైమెట్ కంట్రోల్ సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. మరియు మెరుగైన ఆడియో కోసం బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు కారు క్యాబిన్ చాలా ఆకట్టుకుంటుంది. ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారు 6.0 లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 603 hp శక్తి, 900Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది మరియు ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఈ కారు సాధారణంగా 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అయితే కస్టమర్లు కావాలనుకుంటే 20, 21 అంగుళాల వీల్ యూనిట్‌లకు అప్‌గ్రేట్ చేసుకొనే అవకాశాన్ని సంస్థ ఇస్తుంది. ఈ మేబ్యాక్ S680 కారు ధర రూ.3.5 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

కంగనా రనౌత్ తన అద్భుతమైన నటనకు అనేక అవార్డులను అందుకుంది. ఇందులో 4 జాతీయ చలనచిత్ర, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో 6 సార్లు చోటు సంపాదించుకున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా అత్యధిక అభిమానులను సంపాదించుకున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








