కారు ముందు కంగనా శర్మ అందాల ఆరబోత... బ్లాక్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కించే లుక్స్‌తో!

బాలీవుడ్ తారలు కార్ల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. నచ్చిన కార్లను అవసరమైతే విదేశాల నుంచి తెప్పించుకుని వాడుతుంటారు. అయితే కొందరు నటులు మాత్రం.. విదేశీ కార్లకంటే భారత్‌లో తయారైన కార్లపై ఇంకా ఎక్కువ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ కంగనా శర్మ మహీంద్రా XUV 7OO కారుతో కనిపించి కనువిందు చేసింది. హాట్ లుక్స్‌తో ఉన్న ఈ బ్యూటీ ఈ కారు ముందు మరింత మెరిసిపోయి కనిపించింది. కంగనాను ఆమె కారును చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపెట్టారు. కారుతో కనిపించిన ఈ భామ ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆకట్టుకునే స్టైల్‌లో ఉన్న కంగనా శర్మ.. మహీంద్రా XUV 7OO కారు ముందు నిల్చుని ఫోటోలకు పోజులిచ్చింది. ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంలో ఆమె ఇలా దర్శనమిచ్చింది. కారు ముందు హాట్ లుక్స్‌తో ఉన్న ఈ నటి ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు భారీగానే ఎగబడ్డారు.

Kangana Sharma with Mahindra XUV 700

మహీంద్రా XUV 7OO కారు.. బాలీవుడ్ తారలకు ఫేవరేట్ వాహనంగా పేరు సంపాదించింది. ఇది రెండు పవర్‌ఫుల్ ఇంజిన్స్‌తో వస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 200 bhp పవర్ 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక మరో 2.2 లీటర్ టర్బో- డీజిల్ ఇంజిన్ 155 bhp పవర్, 360 Nm టార్క్ అందిస్తుంది.

ఈ రెండు ఇంజిన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో జోడించి ఉంటాయి. దీంట్లో డీజిల్ వేరియంట్ all-wheel drive ఆప్షన్‌తో ఉంటుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతి అందిస్తుంది. మహీంద్రా ఇతర ఎస్‌యూవీల్లానే ఈ XUV700 కారు కూడా మంచి ఫీచర్లతోనే వచ్చింది. దీంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్, హైట్- అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ స్పాయిలర్, ఫాలో-మి-హోమ్ హెడ్‌లైట్స్ ఉంటాయి.

Kangana Sharma Car

రియర్ వైపర్, డీఫాగర్, డూర్ అండ్ బూట్-లిడ్ అన్‌లాక్ ఫంక్షన్ వంటివి కూడా ఈ కారులో ఉంటాయి. దీంట్లోని టాప్ వేరియంట్‌లో స్టార్ట్- స్టాప్ ఫంక్షన్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ ఎఫీషియన్సీని అందిస్తుంది. ఇక దీని సేఫ్టీ విషయానికిి వస్తే ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ADAS) ఉంటుంది. ఇందులో ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటివి కూడా ఉంటాయి.

ఇందులో ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అంతేగాకుండా ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360-డిగ్రీ వ్యూ వంటివి కూడా ఉంటాయి. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంట్లో 5-సీటర్, 7-సీటర్ కన్ఫిగరేషన్లు ఉంటాయి.

ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. దీంట్లో టాప్ వేరియంట్ ధర రూ.26.04 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షో రూమ్ ధరలు. 2021 సెప్టెంబరులో లాంఛ్ అయినప్పటి నుంచి ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీగా నిలుస్తోంది.

దీని స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్స్, స్పేషియర్ ఇంటీరియర్ ద్వారా చాలా మంది వినియోగదారులు ఈ కారును కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఈ కారు 2,00,000 యూనిట్ల అమ్మకాల మైల్‌స్టోన్ దాటింది. ప్రతి నెల సగటున ఈ కారు 5,722 అమ్మకాలు జరుగుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2025, 12:53 [IST]
English summary
Kangana sharma with mahindra xuv 700 made fans shocks with beauty video went viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+