దంపతులపైకి దూసుకెళ్లిన కన్నడ నటుడి కారు.. భార్య మృతి, నటుడిపై కేసు నమోదు
బెంగళూరులో గత శనివారం(సెప్టెంబర్ 30న) ఘోర ప్రమాదం(Accident In Bengaluru) చోటుచేసుకుంది. భార్యాభర్తలు రోడ్డుపై వెళ్తుండగా కన్నడ నటుడు నాగభూషణ(30) కారు వారిని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రతి రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం ఇలా పలు కారణాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

మూడు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సినీ నటుడు కారణం కావడంతో అక్కడ ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. బాధితులు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది పూర్తి వివారాల్లోకి వెళితే..
బెంగళూరులోని వసంతపుర మెయిన్ రోడ్డులో దంపతులు ప్రేమ(48), కృష్ణ(58) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారులో వస్తున్న నటుడు NS నాగభూషణ(NS Nagabhushana) వారిని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి విషమించడంతో భార్య ప్రేమ మృతి చెందింది.

ప్రమాదానికి కారణమైన నటుడు నాగభూషణపై పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్‌గా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అయితే నాగభూషణకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. కాగా ప్రమాదానికి సంబంధించి నాగభూషణ, పోలీసులు కొన్ని వివరాలు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో నాగభూషణ మద్యం సేవించినట్లుగా లేదని పోలీసులు తెలిపారు. అయితే అతను నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ సౌత్ డీసీపీ శివ ప్రకాష్ దేవరాజ్ వెల్లడించారు. కాగా దంపతులు అకస్మాత్తుగా ఫుట్‌పాత్ నుంచి రోడ్డుపైకి వచ్చారని.. దీంతో ఊహించని పరిణామంతో వారిని ఢీకొట్టడం జరిగిందని నాగబూషణ పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారితో కలిసి దంపతులను ఆస్పత్రికి తరలించినట్లు నాగభూషణ తెలిపారు. కానీ ప్రేమను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దంపతుల కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన పార్థ. కె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని తండ్రి ఆటో రిక్షా నఀడుపుతున్నారు.
ఏదేమైనా రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వాహనం నడిపేటప్పుడు వారి భద్రతతో పాటు ఇతరుల సేఫ్ట్టీని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే చేయని తప్పునకు అమాయకులు బలి కావాల్సి ఉంటుంది. అందుకే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








