షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

టీవీ ప్రోగ్రామ్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో 'బిగ్ బాస్' ఒకటి. ఈ ప్రోగ్రామ్ కేవలం తెలుగులో మాత్రమే కాదు, కన్నడ భాషలో కూడా ఎక్కువ ప్రజాదరణ పొందింది. బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో విజేతలుగా నిలిచినవారు, ఒక సెలబ్రెటీ క్రేజుని పొందుతారు. ఇది అందరికి తెలిసిన విషయమే.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

బిగ్ బాస్ కన్నడ సీజన్ 7 విజేత షైన్ శెట్టి గురించి తెలుగు వారికి అంతగా తెలియకపోయినప్పటికీ కన్నడ ప్రజలకు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. షైన్ శెట్టి టెలివిజన్ నటుడు కూడా. ఇతనికి కార్లంటే చాలా ఇష్టం, ఈ కారణంగానే లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

షైన్ శెట్టి ఇటీవల జర్మనీ లగ్జరీ కార్ అయిన BMW X1 కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షైన్ శెట్టి కొనుగోలు చేసిన ఈ కొత్త BMW X1 కారు ఫోటోలను మీరు ఇక్కడ గమనించవచ్చు.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

షైన్ శెట్టి బ్లూ కలర్ BMW X1 కారును కొనుగోలు చేశారు. కొత్త కారు ముందు షైన్ శెట్టి తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఇటీవల, లగ్జరీ ఆడి కారును కూడా కొనుగోలు చేశారు. ఇవి మాత్రమే కాకుండా ఇంతకు ముందు బిఎమ్‌డబ్ల్యూ మరియు ఎంజీ హెక్టర్ అనే రెండు ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

'మీరా మాధవ' మరియు 'లక్ష్మీ బారమ్మ' సీరియల్స్‌తో కన్నడ టెలివిజన్‌లో గుర్తింపు పొందిన షైన్ శెట్టి 'బిగ్ బాస్' లో బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ కన్నడ 7 ఈవెంట్ విజేత షైన్ శెట్టికి టాటా ఆల్టోజ్ కారు కూడా లభించింది. గత ఏడాది టాటా ఆల్టోజ్ కారు ఓనర్ అయిన షైన్ శెట్టి ఇప్పుడు ఖరీదైన BMW కారుకి ఓనర్ అయ్యాడు.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

షైన్ శెట్టి ప్రస్తుతం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో జేమ్స్ సినిమాతో బిజీగా ఉన్నారు. నటుడు షైన్ శెట్టి శాండల్‌వుడ్ మరియు టెలివిజన్‌లో అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందిన షైన్ శెట్టి, ప్రైవేట్ యాజమాన్యంలోని డ్యాన్స్ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా కూడా కనిపిస్తున్నాడు.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

షైన్ శెట్టి కొనుగోలు చేసిన BMW X1 విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 192 బిహెచ్‌పి మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 190 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ స్టెప్టోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజిన్ మోడల్‌లో ప్రామాణికమైనది, డీజిల్ వెర్షన్‌లో 8-స్పీడ్ స్టెప్టోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

కొత్త BMW X1 కారు ముందు భాగంలో ఒక పెద్ద సిగ్నేచర్ గ్రిల్ జతచేయబడి, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌లైట్ మరియు పెద్ద ఎయిర్ ఇంటెక్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి, అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్‌తో పాటు, డిజైన్‌లో ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు రియర్ వ్యూ కెమెరా వంటి ఉన్నాయి.

షైన్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్, ఇదే.. చూసారా!!

BMW X1 కారులో వైర్ లెస్ ఛార్జింగ్ సాకెట్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. BMW X1 ఆల్పైన్ వైట్, బ్లాక్, బ్లాక్ సఫైర్, గ్లేసియర్ వైట్, మినరల్ వైట్, మినరల్ గ్రే, స్పార్క్లింగ్ బ్రౌన్, స్పార్క్లింగ్ స్టార్మ్, సన్ సెట్ ఆరంజ్, జుక్కారో బిజ్ మరియు స్పోర్మే బే మెటాలిక్ కలర్స్ లో లభిస్తుంది.ఈ కారు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటడం వల్ల, ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kannada actor shine shetty bought new bmw car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X