స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

ఈగ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, తరచూ తన మిత్రులకు ఏదో ఒక కానుక ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా తన స్నేహితుడికి ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ లగ్జరీ బైక్ ను కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

కిచ్చా సుదీప్ కి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు లభించింది. భాషతో సంబంధంతో లేకుండా ఈ చిత్రం చాలా మందిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుదీప్ విలన్ పాత్ర పోషించినప్పటికీ, అతని నటనతో అందరినీ మెప్పించాడు. ఈ చిత్రం తర్వాత సుదీప్ కెరీర్ ఓ పెద్ద మలుపు తీసుకుంది. దీంతో ఈ కన్నడ నటుడిపై కాసుల వర్షం కురుస్తోంది.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

సుదీప్ సెప్టెంబర్ 2వ తేదీన తన జన్మదినాన్ని జరుపుకున్నాడు.ఈ కోలీవుడ్ హీరో 49 ఏళ్లు పూర్తి చేసుకుని, ఇప్పుడు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. కిచ్చా సుదీప్ పుట్టినరోజును ఆయన అభిమానులు ముఖ్యంగా కర్ణాటకలో ఘనంగా జరుపుకున్నారు.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

కిచ్చా సుదీప్ గతంలో తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు వీలైనంత సాయం చేశారు. ఈసారి అతను తన స్నేహితుడు మరియు బిగ్ బాస్ కన్నడ సీజన్ 2 విజేత అయిన నటుడు అకుల్ బాలాజీకి ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ (BMW G310R) బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని అకుల్ బాలాజీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

అకుల్ బాలాజీకి కిచ్చా సుదీప్ ఇచ్చిన బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ పూర్తిగా సరికొత్త బైక్ కాదని తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఆర్టీఓ కార్యాలయంలో నమోదు చేయబడిన పాత బైక్ తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ఫోటోలలో KA 05 KR 3666 అనే రిజిస్టర్ నెబరును ఈ బైక్ పై చూడొచ్చు.ఈ BMW G310R బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) యొక్క ఎంట్రీ లెవల్ స్ట్రీట్‌ఫైటర్ బైక్. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 2.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ G310R స్టాండర్డ్ అనే ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్‌ను రేసింగ్ బ్లూతో పాటు పోలార్ వైట్, రేసింగ్ రెడ్, కాస్మిక్ బ్లాక్ అనే 3 ఇతర కలర్ ఆప్షన్‌లలో కూడా విక్రయిస్తున్నారు. నటుడు కిచ్చా సుదీప్ తన స్నేహితుడికి ఇచ్చిన బైక్ రేసింగ్ రెడ్ కలర్ పెయింట్ స్కీమ్ ను కలిగి ఉంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ముందు వైపు ఎల్‌ఈడి లైటింగ్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌ మరియు ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉండి, బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900ఆర్ మోడల్‌ను పోలినట్లుగా ఉంటుంది.

జి310ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ లో శక్తివంతమైన 313cc వాటర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 34 హెచ్‌పి పవర్ ను మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.6 ఎన్ఎమ్ టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కాన్‌స్టాంట్ మెష్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్ గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లు. ఈ బైక్‌లో రైడర్ సీటు భూమి నుండి 30.9 అంగుళాల ఎత్తులో అమర్చబడి ఉంటుంది.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఇన్‌వర్టెడ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కాయిల్‌ఓవర్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో భాగం కావాలనుకునే వినియోగదారుల కోసం బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ ఉత్తమమైన ఆప్షన్. ఇది ఈ విభాగంలో కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్, టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310, బజాజ్ డొమినార్ 400 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

స్నేహితుడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కిచ్చా సుదీప్.. ఆ గిఫ్ట్ ఏంటంటే..?

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జి310ఆర్ తో పాటుగా దాని ఫెయిర్డ్ వెర్షన్ అయిన జి310జిఎస్ ను తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇవి రెండూ 313 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉండి ఒకేరకమైన పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2022, 10:02 [IST]
English summary
Kannada actor sudeep gifts bmw g 310 r motorcycle to his friend
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+