కన్నడ హీరో కిచ్చా సుదీప్ కారుకు పీపీఎఫ్ రక్షణ.. ఎందుకంటే?
ప్రపంచంలో అత్యంత పారితోషికం అందుకుంటున్న వ్యక్తుల్లో సినిమా హీరోలు ముందువరుసలో ఉంటారు. అందువల్ల చాలా మంది అత్యంత విలాసంతమైన జీవితాన్ని గడుపుతారు. అందులో ముఖ్యమైనవి వారు ఉపయోగించే లగ్జరీ కార్లు. చాలా మంది సెలబ్రిటీలు ఫ్యాన్సీ స్పోర్ట్స్ కార్లు లేదా SUV, మరికొంత మంది నటులు MPVలను ఎంచుకుంటారు. అందులో టాయోటా ఫ్లాగ్‌షిప్ మోడల్ MPV వెల్‌ఫైర్ ఒకటి.
కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన టాయోటా వెల్‌ఫైర్ కారుకు పీపీఎఫ్ మ్యాటీ రక్షణ ఏర్పాటుచేసుకున్నారు. కిచ్చా సుదీప్ కారుకు పీపీఎఫ్ (పెయింట్ ప్రొటక్షన్ ఫిల్మ్) రక్షణ కల్పిస్తున్న వీడియోను డ్రైవ్‌హుడ్ తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంత మంది టెక్నీషియన్లు కారును శుభ్రం చేయడం, పీపీఎఫ్ రక్షణ ఏర్పాటుచేయడం మనం ఈ వీడియో చూడొచ్చు. సర్వీస్ సెంటర్ యాజమాని నుంచి కారును అందుకుంటున్న దృశ్యాలను గమనించవచ్చు.

మొట్టమొదట.. సర్వీస్ సెంటర్‌లోని టెక్నీషియన్లు టయోటా వెల్‌ఫైర్ కారుకు పీపీఎఫ్‌ను ఏర్పాటుచేయడంలో భాగంగా క్రోమ్ గ్రిల్‌ను తీసివేయడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. కారు అంతా పీపీఎఫ్ మ్యాట్‌తో కప్పి ఉంచడం చూడొచ్చు. అయితే ఈ పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొటక్షన్ ఫిల్మ్ (థర్మోప్లాస్టిక్ ఉరేథేన్ ఫిల్మ్). కారుపై ఎటువంటి గీతలు, రాక్ చిప్స్ సహా ఎటువంటి నష్టం కలగకుండా ఈ ఫిల్మ్‌ను ఏర్పాటుచేస్తారు.
కారు మోడల్‌ను బట్టి ఈ ఫిల్మ్ అందుబాటులో ఉంటుంది. మరియు ఈ ఫిల్మ్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దీన్ని కారు మొత్తానికి లేదా కొన్ని ప్రత్యేకమైన భాగాలు అంటే బంపర్ లేదా బానెట్‌కు అతికించవచ్చు. ఈ పెయింట్ ప్రొటక్షన్ ఫిల్మ్ UV కిరణాలు, రసాయనాల నుంచి రక్షిస్తుంది. కారు పెయింట్‌కు ఎటువంటి నష్టం లేకుండా పీపీఎఫ్‌ను తొలగించవచ్చు. కారు యొక్క అపియరెన్స్‌ను కాపాడడం మరియు రీసేల్ విలువ తగ్గకుండా చూసుకొనేందుకు ప్రస్తుతం చాలా మంది పీపీఎఫ్ ఏర్పాటుచేసుకుంటున్నారు.
ఈ వీడియోలో కారు కుడివైపున.. హీరో కిచ్చా సుదీప్ లోగో 'K'.. ను మనం గమనించవచ్చు. సుదీప్ ప్రైవసీ కోసం కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లు ఏర్పాటుచేశారు. అయితే సుదీప్ కారు టయోటా వెల్‌ఫైర్‌కు ఏర్పాటుచేసిన పీపీఎఫ్ బ్రాండ్ ఏంటనేది వెల్లడించలేదు.
ఇండో - జపనీస్ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా కిర్లిస్కర్ మోటర్.. ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన MPV వెల్‌ఫైర్‌ను తయారుచేసింది. టాయోటా MPVల్లో ఈ వెల్‌ఫైర్ అత్యంత ఖరీదైనది. ఈ కార్లు భారత్‌లో తయారుచేయడం లేదు. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) ద్వారా భారత్‌లోకి దిగుమతి చేయబడుతున్నాయి.
ఈ టయోటా వెల్‌ఫైర్ కారు హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 117 PS అవుట్‌పుట్‌ని ఇస్తుంది. దీంతోపాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఫ్రంట్ యాక్సిల్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 143 PS అపుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. అదే వెనుక యాక్సిల్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 68 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు యాక్సెల్స్ వద్ద నుంచి ఎలక్ట్రిక్ మోటార్‌లతో టయోటా వెల్‌ఫైర్ 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) వాహనంలా పనిచేస్తుంది.
ARAI ఫలితాల ప్రకారం ఈ కారు 16.35 km\l మైలేజ్ అందిస్తుంది. భారత్‌లో ఉన్న అత్యంత సమర్థవంతంగా ఇంధనం ఉపయోగించుకొనే వాహనాల్లో ఈ వెల్‌ఫైర్ ఒకటిగా నిలిచింది. ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీలను రీఛార్జ్ చేసేందుకు బ్రేకింగ్ ఉపయోగపడుతుంది. ఈ కారు సెవెన్ సీటర్‌తో వస్తుంది. ఎక్స్ షోరూం ధర రూ.96.55 లక్షలు.


Click it and Unblock the Notifications








