సీరియల్స్ చేస్తూ ఖరీదైన కారు కొన్న ఆరేళ్ల చైల్డ్ ఆర్టిస్ట్.. వైరల్ అవుతున్న విజువల్స్!
కన్నడలోని పాపులర్ సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత గురించి తెలియని వారు ఉండరు. ఈ చైల్ట్ ఆర్టిస్ట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత చిన్న వయసు లోనే లక్షలాది మంది హృదయాలను ఈ చిన్నారి గెలుచుకుంది. కేవలం ఆరేళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా తన నటనతో ఫేమస్ అయ్యింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తాను కొత్తగా కొనుగోలు చేసిన కారుని డెలివరీ తీసుకుంటూ పంచుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుంది. ఆ రీల్ వైరల్ కావడంతో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. తన కొత్త కారుకి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
ఈ కారుని నిషిత ఆగస్టు 26న కొనుగోలు చేసింది. ఈ కారును కొనుగోలు చేసిన సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఈ రీల్ ఇంటర్‌నెట్‌లో లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ ఆరేళ్ల బాల నటి నిషిత లక్ష్మీ నివాస సీరియల్‌లో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. లక్ష్మీ నివాస సీరియల్ తను ఖుషీ అనే పాత్ర పోషిస్తుంది.

దీనితో పాటు నిషిత సోషల్ మీడియాలో కూడా స్టార్‌గా ఉంది. నిషిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డాన్స్ చేస్తూ డైలాగులు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ క్రేజ్ సంపాదించింది. నిషిత ఇన్‌స్టాగ్రామ్ పేజీని తన తల్లి ఇన్‌స్టాగ్రామ్ పేజీని మెయింటైన్ చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను కొనుగోలు చేసిన కారుల తన తల్లి నిషిత పేరు మీద ఉంది.
ఈ హ్యుందాయ్ ఎస్‌యూవీకి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. మొత్తం హ్యుందాయ్ సేల్స్‌లో దాదాపు 60 శాతానికి పైగా ఈ కారు నుంచే రాబడి వస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ కారు ఎస్‌యూవీల్లోనే నంబర్ వన్‌గా కొనసాగుతుంది. హ్యుందాయ్ ఈ ఏడాది ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్ క్రెటా ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని స్పోర్టియర్ మోడల్ క్రెటా ఎన్ లైన్ కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ క్రెటాను ఆ కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ఈ క్రెటా రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ డీసీటీ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఇ, ఇఎక్స్, ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్ (ఓ) అనే ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని ఒక్కో వేరియంట్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో పాటు, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, డ్యూయల్ జోన్ ఏసీ, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏస్‌తో వస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








