హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. కానీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేశారు.

అయితే కొంతమంది పోలీసులు కార్ డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని మరియు ఆటో డ్రైవర్ హెల్మెట్ ధరించలేదనే కారణాలతో వాహనదారులకు ట్రాఫిక్ జరిమానాలు విధిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలోని ట్రాఫిక్ పోలీసులు మారుతి సుజుకి స్విఫ్ట్ డ్రైవర్‌కు చలాన్ జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఈ చలాన్ ప్రకారం, కారు నడుపుతున్నప్పుడు కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా కారు డ్రైవర్‌కు రూ .1,000 చలాన్ అందజేశారు. ఇది చూసిన కారు డ్రైవర్ ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా హెల్మెట్‌లు కేవలం ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ఉద్దేశించబడ్డాయి. అంతే కానీ కారులో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాలనే నియమం ఎక్కడా లేదు. కారు డ్రైవర్‌లకు సీటు బెల్ట్ తప్పనిసరి నిబంధన, ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ ఇక్కడ కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

సాధారణ కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించనందుకు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, లైసెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి సరియన్ డాక్యుమెంట్స్ లేకుంటే వారికి పోలీసులు జరిమానా విధించాలి. అంతే కానీ కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించడమనేది చాలా అమానుషమైన చర్య.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

ట్రాఫిక్ పోలీసులు వల్ల ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాయడం ఇదే మొదటి సారి కాదు. చాలా మంది బైక్ రైడర్స్ కూడా సీట్ బెల్ట్ ధరించలేదనే కారణంగా కూడా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితులు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టం ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా జరిమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకే రోజులో జరిమానాలు లక్షలకు చేరుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ కొత్త నిబంధనతో, ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఎక్కువ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

మోటార్ వాహన చట్టం ప్రకారం, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే 15 రోజుల్లో ఈ-చలాన్ జారీ చేయబడుతుంది. సెంట్రల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చలాన్‌లు మరియు జరిమానాల కేసులపై సత్వర చర్య కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులలో ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ మరియు నియమాల అమలు కోసం డిపార్ట్‌మెంట్ సెంట్రల్ మోటార్ వాహన చట్టాన్ని సవరించింది.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

కొత్త నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా, ట్రాఫిక్ పర్యవేక్షణ పరికరాలైన పోలీస్ స్పీడ్ కెమెరా, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా, స్పీడ్ గన్, బాడీ వేరియబుల్ కెమెరా, డాష్‌బోర్డ్ కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వెయిటింగ్ మెషీన్‌లను ఉపయోగించవచ్చు. ఒక మిలియన్ జనాభా ఉన్న ప్రధాన నగరాల్లో అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన రహదారులలో కూడా సరైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర రవాణా శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యను తగ్గించడమే ఈ చర్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర రవాణా శాఖ తన నోటిఫికేషన్‌లో 132 నగరాలను జోడించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన పదిహేను రోజుల్లో సంబంధిత వాహనదారుడికి ఈ-చలాన్ పంపబడుతుంది. కావున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు జరిమానా.. ఎక్కడో తెలుసా?

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో పాటు, వాహనదారులు కూడా సహకరించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. కావున వాహనదారులు కూడా సరైన నియమాలను పాటించి తమను తాము రక్షించుకోవాలి.

NOTE: ఇక్కడ ఉపయోగించిన మొదటి మూడు ఫోటోలు తప్ప మిగిలిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Kanpur man begins wearing helmet after getting fined for driving car without helmet details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X