పార్క్ చేసిన బైక్‌లపైకి కారు ఎక్కించిన మహిళ.. వీడియో చూస్తే మతిపోతుంది..!
డ్రైవింగ్ శిక్షణలో ఉండగానే కారు నడిపిన కారణంగా ఓ మహిళ పెద్ద ప్రమాదానికి కారణం అయింది. ఈ ఘటన కాన్పూర్‌లోని ఓ మార్కెట్ వద్ద జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పూర్తిస్థాయిలో డ్రైవింగ్ తెలియని ఓ మహిళ.. కారు రివర్స్ చేస్తున్న సమయంలో వెనుక ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌లు భారీగా దెబ్బతిన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లోని గుమ్టి మార్కెట్‌లో పార్కింగ్ చేసిన బైక్‌లపైకి ఓ కారు దూసుకొచ్చింది. కారును రివర్స్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అనంతరం కారును డ్రైవ్ చేసిన మహిళ వాహనంలోనే ఉండిపోయారు. అయితే దెబ్బతిన్న బైక్‌ల యాజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అరవడం వీడియోలో మనం గమనించవచ్చు.

సమాచారం అందుకున్న ఫజల్‌గంజ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులకు నష్టపరిహారం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడ వారంతా శాంతించారు. సుమారు 1.07 నిమిషాలు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో నాలుగు బైక్‌లపై కారు దూసుకెళ్లిన విధానం చూడవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి దిగిన మహిళ జరిగిన నష్టాన్ని చూసి మళ్లీ కారులోకి వెళ్లిపోయారు. కారు స్టార్ట్ చేసి, బైక్‌ల పైనుంచి కిందకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున జనం అక్కడ చేరి, నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు.
మంగళవారం సాయంత్ర సమయంలో గుమ్టి మార్గెట్ సమీపంలో కొన్ని బైక్‌లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కారును రివర్స్ చేసేందుకు మహిళ ప్రయత్నం చేశారు. అనుకోకుండా కారు వెనుక ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడున్న నాలుగు నుంచి ఆరు బైక్‌లు భారీగా దెబ్బతిన్నాయి. వాటితో పాటు సుమారు డజన్ బైక్‌లు కొంతమేర దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదం తర్వాత కారు డ్రైవింగ్ చేసిన మహిళ వివరణ ఇచ్చింది. తనకు కారు డ్రైవింగ్ చేయడంలో పెద్దగా అనుభవం లేదని, ప్రస్తుతం కారు డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ వద్ద ప్రమాదం, ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వారందరికీ సర్దిచెప్పారు. బందోబస్తు మధ్య ప్రమాదానికి కారణమైన మహిళ మరియు నష్టపోయిన బైక్ యాజమానులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నిర్లక్ష్యంగా కారును నడిపి, ప్రమాదానికి కారణమైన మహిళకు మాత్రం 2,500 రూపాయలను పోలీసులు జరిమానా విధించారు. అలాగే ఇరువర్గాల మధ్య తర్వాత ఎటువంటి ఘర్షణ జరగకుండా ఒప్పందం కుదిర్చారు. అయితే ఈ ప్రమాదంపై ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, కేసు నమోదుచేయలేదని పోలీసులు తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








