డ్యాన్స్ వేసినందుకు రూ. 9,000 జరిమానా.. ఇంతకీ డ్యాన్స్ ఎక్కడ వేసాడంటే?

ఈ రోజుల్లో యువత సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఎంతటి పని అయినా చేయడానికి వెనుకాడరు. దీని కోసం చిత్ర విచిత్రమైన వెకిలి చేష్టలు చేస్తూ పోలీసులకు బుక్కయిపోతూ, నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇది వరకు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మరో సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌, కళ్యాణ్‌పూర్‌లోని మస్వాన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఖలీద్ అనే యువకుడు బైక్‌పై చేసిన ఓ వీడియోకు చాలా పాపులర్ అయ్యాడు, కానీ ఎంత పాపులర్ అయ్యాడో అంతకుమించిన రీతిలో పోలీసులు అతనికి ఒక ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువకుడు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాడు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

ఖలీద్‌కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటే స్టేజి మీద వేస్తే గుర్తింపు వస్తుంది. కానీ యితడు ఏకంగా అతడు వెళ్తున్న బైకుపైనే డ్యాన్స్ వేసి అందరిని ముగ్దుల్ని చేసాడు. ఇతని డ్యాన్స్ కి చాలామంది నెటిజన్స్ ఫిదా అయ్యారు, కానీ మరికొందరు ఇతని డ్యాన్స్ కి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

ఖలీద్‌కు కామెంట్స్ మరియు లైక్స్ వర్షం రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఇది పోలీసుల దృష్టికి చేరడంతో ఆనందం కాస్త బాధగా మారింది. అతనికి ఏకంగా 9,000 రూపాయలు చలాన్ విధించారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల మరియు ప్రజా రహదారిపైన మోటార్ వాహన చట్టానికి వ్యతిరేఖంగా నడుచుకోవడం వల్ల ఈ చలాన్ విధించారు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

ఈ కాన్పూర్‌ యువకుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పైన రైడ్ చేసినట్లు సమాచారం. ఈ యువకుడికి వాహన చట్టంలోని 4 సెక్షన్ల కింద నోటీసు కూడా పంపారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, మూడు రోజుల్లో జరిమానా చెల్లించేందుకు యువకుడికి గడువు ఇచ్చారు. ఈ విషయమై ఖలీద్ అహ్మద్ కూడా స్పందించారు. ఈ చలాన్ మొత్తాన్ని ఇప్పటికే డిపాజిట్ చేశానని, తాను కూడా తన తప్పును అంగీకరించానని చెప్పారు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

అంతే కాకుండా అతనికి ఇలాంటి రూల్స్ ఏవి తెలియదని, ఈ కారణంగానే ఈ ఈడియె చేసినట్లు తెలిపాడు. అయితే మొత్తానికి చేసిన తప్పుకుగాను, జరిమానా చెల్లించక తప్పలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో చాలా వైరల్ గా మారింది. అయితే దీనిపై కొంతమంది స్పందిస్తూ ఇలాంటి పని ఒక సెలబ్రెటీ చేసి ఉంటే మీరు శిక్షించి వుంటారా.. అని ప్రశ్నించారు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

అయితే ఇదే సమయంలో కొంతమంది స్పందిస్తూ, ఈ యువకుడు ఒకేసారి చాలా త్వరగా పాపులర్ అయ్యాడని, ఇప్పుడు యితడు కేవలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో పాపులర్ అయ్యాడు. అయితే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. ఇటువంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. వీటిపైన సంబంధిత పొలిసు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

దేశంలో ప్రతి సంవత్సరం ఎంతోమంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. అంతే కాకుండా డ్రంక్ డ్రైవ్ కూడా. ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి.

దేశంలో ఇప్పుడు మోటార్ వాహన చట్టం చాలా కఠినంగా ఉంది. కావున సంబంధిత అధికారులు కూడా ఈ నియమాలను తప్పకుండా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల అల్ జరిగే మరణాల రేటుని గణనీయంగా పెంచడానికి కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులను ప్రమాదాల నుంచి బయటపడవేస్తాయి.

రన్నింగ్ బైక్‌పై డ్యాన్స్.. రూ. 9,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

మీరు కూడా తప్పని సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రభుత్వాలకు కూడా సహకరించాలి, అప్పుడే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో గణనీయమైన ఫలితాలను పొందగలవు. కావున రోడ్డుపై వాహన వినియోగదారులు వెకిలి చేష్టలకు స్వస్తి పలకాలి. అప్పుడే మరణాల రేటు గణనీయంగా తగ్గుతాయి. అంతే కాకుండా ట్రఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపైనా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇలాంటివి అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Most Read Articles

English summary
Kanpur youth riding bullet without helmet challan for rs 9000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X