ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఆఫ్ రోడింగ్ అంటేనే మొదట గుర్తొచ్చే కొన్ని వాహనాల్లో 'ఫోర్స్' కంపెనీకి చెందిన 'గూర్ఖా' ఒకటి. కావునా ఎక్కువమంది ఆఫ్ రోడింగ్ ప్రియులు 'ఫోర్స్ గూర్ఖా' కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ కూడా నాలుగు 'ఫోర్స్ గూర్ఖా' ఎస్‌యూ‌విలు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

కర్ణాటక అటవీ శాఖ నాలుగు 'ఫోర్స్ గూర్ఖా' ఎస్‌యూ‌విలు డెలివరీ చేసుకున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇందులో నాలుగు 'ఫోర్స్ గూర్ఖా' ఎస్‌యూ‌విలు డీలర్‌షిప్ వెలుపల ఉండటం మీరు చూడవచ్చు. ఈ కొత్త ఆఫ్ రోడింగ్ వాహనాలను చామరాజ్‌నగర్ జిల్లాలోని కొల్లేగల్ చుట్టుపక్కల అడవిలో అటవీ శాఖ పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తుంది.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

సాధారణంగా రాష్ట్రంలోని అడవులను మరియు జంతు జాతులను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రంలోని అటవీశాఖ అధికారులదే. కావున అడవులను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. దీని కోసం అడవుల్లో తిరగటానికి పటిష్టమైన మరియు బలమైన వాహనాలు కావాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక అటవీశాఖ ఫోర్స్ గూర్ఖా వాహనాలను కొనుగోలు చేసింది. ఇవి ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేసిన వాహనాలు, కాబట్టి వీటిని అడవుల్లో సైతం సులభంగా ఉపయోగించవచ్చు.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

అటవీశాఖ అధికారులు అడవుల మధ్యలో మరియు ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ప్రయాణించాల్సి వస్తుంది, కావున అలంటి ప్రాంతాలకు ఈ ఫోర్స్ గూర్ఖా కార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లోని అటవీ శాఖ అధికారులు మారుతీ జిప్సీ, మహీంద్రా కమాండర్, మహీంద్రా థార్ మరియు మహీంద్రా బొలెరో వంటి వాహనాలను ఉపయోగించారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా కర్ణాటక అటవీశాఖ అధికారులు ఇందులో ఫోర్స్ గూర్ఖా కార్లను చేర్చారు.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఇక ఫోర్స్ గూర్ఖా విషయానికి వస్తే, ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడ్ ఎస్‌యూ‌వి. ఈ ఎస్‌యూ‌వి ధర ప్రస్తుతం రూ. 14.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫోర్స్ గూర్ఖా చూడటానికి చాలా స్టైలిష్ ఉండి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది రెడ్, గ్రీన్, వైట్, ఆరంజ్ మరియు గ్రే కలర్స్ అనే ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఫోర్స్ గూర్ఖా రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ మీద గూర్ఖా అని వ్రాయబడిన అక్షరాలు మరియు ఎల్ఈడీ స్టాప్ లాంప్‌తో పాటు నిలువుగా ఉంచిన టెయిల్ ల్యాంప్‌లు ఇందులో చూడవచ్చు. అంతే కాకుండా ఇందులోని స్పోర్టి యాక్సెంట్స్ బ్లాక్ ఓఆర్‌విఎమ్‌ల వరకు విస్తరిస్తాయి. ఇందులో దృఢమైన రూప్ రైల్ ఉంటుంది.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఫోర్స్ గూర్ఖా కఠినమైన రోడ్డులో కూడా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటం కోసం సి-ఇన్-సి చాసిస్ మరియు 4 చక్రాలపై కొత్త కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. ఫోర్స్ గూర్ఖా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,116 మిమీ, వెడల్పు 1,812 మిమీ మరియు ఎత్తు 2,075 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్‌ పొడవు 2,400 మిమీ కాగా గ్రౌండ్ క్లియరెన్స్ 210 మి.మీ వరకు ఉంటుంది. కావున ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, లోపల మొత్తం మిడ్ నైట్ బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. వెనుక భాగంలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటుగా త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

ఫోర్స్ గూర్ఖా 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 1,400-2,400 ఆర్‌పిఎమ్ వద్ద 115 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారును 4WD సిస్టమ్‌తో పాటు 5-స్పీడ్ మెర్సిడెస్ G-28 ట్రాన్స్‌మిషన్‌తో జతచేయవచ్చు.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ సీటింగ్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. మొత్తం మీద ఫోర్స్ గూర్ఖా అద్భుతమైన వాహనం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క: కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన 'ఫోర్స్ గూర్ఖా' కార్లు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఫోర్స్ గూర్ఖా అంటేనే అద్భుతమైన ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కలిగిన వాహనం అని విశ్వసిస్తారు. ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో ఇవి విక్రయించబడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు సాధారణ ఆఫ్ రోడ్ ప్రేమికులు మాత్రమే కొనుగోలు చేసే ఈ ఎస్‌యూ‌విని ఇప్పుడు కర్ణాటక అటవీశాఖ అధికారులు సొంతం చేసుకున్నారు. కావున రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Karanataka state forest department has taken delivery of five force gurkha suvs
Story first published: Saturday, June 18, 2022, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X