కార్గిల్ అమరవీరులకు నివాళిగా భారీ బైక్ ర్యాలీ.. !
కార్గిల్ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని బెంగళూరులో సైనికులతో కలిసి వివిధ క్లబ్‌లకు చెందిన బైక్ రైడర్లు తమ దేశభక్తిని ప్రదర్శించారు. మన దేశంలో సైనికులు, అమర వీరులపై ప్రజలు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా గౌరవిస్తారు. అందులో భాగంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బెంగళూరులో రైడ్ విత్ సోల్జర్స్ పేరిట జులై 30 (ఆదివారం) ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ప్రముఖ రిసార్ట్స్ వ్యవస్థాపకుడు మరియు ఎండీ శ్రీహరిరాజు, సీకెపీసీ ఫౌండర్, ఎండీ కేజే పురుషోత్తం, కర్ణాటర ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత భూభాగాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ సైన్యాన్ని.. భారత సేనలు జూలై 26, 1999న తరిమికొట్టాయి. దీంతో కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జులై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం కూడా ఆ రోజున కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు నిర్వహించారు. అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. అందులో భాగంగా బెంగళూరులో సైనికులతో కలిగి బైక్ ర్యాలీ నిర్వహించారు. టోర్నడోస్ టీం, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా సుమారు 300 మంది మాజీ సైనికులు, మహిళలు ఈ బైక్ ర్యాలీ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్, ఎమ్మెల్యే ప్రియా కృష్ణ పాల్గొన్నారు. వారితోపాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు నవీన్ నాగప్ప, కల్నల్ ఒమ్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం 6 గంటలకు మానేక్ష పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఉదయం 7:30 గంటలకు బ్రిగేడియర్ రాజేష్ పనికర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. మానేక్ష పరేడ్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై 11 కిలోమీటర్ల దూరంలోని విజయనగర్‌లోని పీజీఎస్ గ్రౌండ్‌లో ముగిసింది. ఈ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న టాప్ 5 క్లబ్‌లను కర్టాటక గవర్నర్ సత్కరించారు.
ర్యాలీ అనంతరం బైక్ రైడర్లు అంతా కలిసి 1000 అడుగుల పొడవున్న భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు సాహస, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డ్రమ్స్ ఇండియా సంస్థ తరఫున పాల్గొన్న డ్రమ్ బీట్ బృందం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమం అనంతరం అమర జవాన్ల విగ్రహాలకు పూలమాల వేసి అందరూ ఘన నివాళి అర్పించారు. ఈ బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళల ధైర్య సాహసాలను కొనియాడారు. టోర్నడోస్ టీం చేసిన బైక్ స్టంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఇటువంటి కార్యక్రమాలు కార్గిల్ యుద్ధ విజయాన్ని గుర్తుచేసుకొనేందుకే కాకుండా, ప్రజల మధ్య ఐక్యతను తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. మరియు ఇటువంటి కార్యక్రమాల ద్వారా యవతరానికి కార్గిల్ యుద్ధం గురించి తెలుస్తుంది. మరియు మన సైనికుల ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








