బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమించిన ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 3,00,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉంది.

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఆక్సిజన్ కొరత ఉంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రతి రోజు చాలామంది చనిపోతున్నారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న భారత్‌కు సహాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. అమెరికా వంటి అగ్రదేశాలతో సహా చాలా దేశాలు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను విమానాల ద్వారా మరియు ఓడల ద్వారా మనదేశానికి పంపిస్తున్నారు.

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. కర్ణాటకలో కూడా సకాలంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదని వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బెంగళూరులో ఆక్సిజన్ బస్సును ప్రారంభించారు.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

బెంగళూరులో ప్రభుత్వ బస్సులను తాత్కాలికంగా ఆక్సిజన్ స్టేషన్ గా మార్చారు. ప్రతి సీటు మధ్య సీట్లు తొలగించి వాటి వెనుక ఆక్సిజన్ సిలిండర్లను అమర్చారు. ఇవి రోగులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా రోగులు హాయిగా కూర్చునేలా సీట్లు రూపొందించబడ్డాయి.

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ బస్సులను బెంగళూరుకు ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్ బస్సులను ప్రారంభించిన తరువాత యడ్యూరప్ప మాట్లాడుతూ కరోనావైరస్ సంక్రమణ విస్తృతంగా ఉందని, దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిందని అన్నారు.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఈ ఆక్సిజన్ బస్సులను ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల వెలుపల ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి ఈ ఆక్సిజన్ బస్సులు సహాయపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం, ఆక్సిజన్ సిలిండర్‌తో ఇరవై బస్సులను మొదటి దశలో ప్రవేశపెట్టనున్నారు.

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ఈ ఆక్సిజన్ బస్సులను ప్రధాన ఆసుపత్రుల దగ్గర నిలిపి ఉంచనున్నారు. ప్రతి బస్సులో ఎనిమిది ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. కావున ఒక్క సరిగా ఎనిమిదిమంది రోగులకు ఒక్కసారిగా ఈ బస్సులు ఆక్సిజన్ అందిస్తాయని యడ్యూరప్ప తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా మహమ్మారి సంక్రమణ నుంచి కోలుకోవడానికి ఆక్సిజన్ చాలా అవసరం. కానీ భారతదేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉంది. ఈ తరుణంలో దేశంలో ఉన్న చాలా వాహన తయారీ కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి పూనుకున్నాయి.

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ఆక్సిజన్ అవసరమైన మేర లభించకపోవడం వల్ల చాలామంది మరణిస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగిపోవడం వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు మరియు వెంటిలేటర్ల కొరత కూడా ఉంది. ఈ ఆక్సిజన్ కొరతను తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ప్రభుత్వాలు ఎంత కృషి చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో చాలా మంది మరణిస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ బస్సులను ప్రవేశపెట్టారు. ఇది నగరంలో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి బస్సులు మరిన్ని అందుబాటులోకి వస్తే మరింత బాగుంటుంది.

Most Read Articles

English summary
Karnataka CM Flags Off Oxygen Buses In Bengaluru. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X