డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డ్రైవ్ చేస్తున్న ఈ కారు ఏదో చెప్పగలరా? (వీడియో)

అభివృద్ధిలో కర్ణాటక వేగంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే రోడ్డు మార్గాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాగిగుడ్డ మెట్రో స్టేషన్ - సెంట్రల్ సిల్క్ బోర్డ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి మెట్రో కో ఎలివేటెడ్ రోడ్డు. దీనికి ఏకంగా 449 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది 3.36 కిమీ పొడవు ఉంది. ఈ ఫ్లైఓవర్‌ మీద శివకుమార్ స్వయంగా ఇన్నోవా హైక్రాస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆర్‌వి రోడ్ - బొమ్మసంద్ర మార్గంలో 3.36 కిమీ ఎలివేటెడ్ మెట్రో రోడ్డును నిర్మించారు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే ఎల్లో లైన్ మెట్రో ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ఫ్లైఓవర్ రాంప్ రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌ని హోసూర్ రోడ్‌ను కలుపుతుంది. ఇది హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు కూడా అనుసంధానించబడి ఉంటుంది.

DK Shivakumar Drive Toyota Innova Hycross

నగరంలోని ఫ్లైఓవర్ మీదుగా మెట్రో లేన్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ పై కారు నడుపుతున్న వీడియోను డీకే శివకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు డీకే శివకుమార్ డ్రైవ్ చేస్తున్న కారు ఏ బ్రాండ్ అని ఆరా తీశారు. ఇది టయోటా కంపెనీ యొక్క ఇన్నోవా హైక్రాస్ అని తెలుస్తోంది.

నిజానికి భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలు పొందిన కార్లలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఒకటి. ఇది 7 సీటర్ మరియు 8 సీటర్ రూపంలో లభిస్తుంది. ఈ కారు మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు తమకు నచ్చిన.. మెచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. పరిమాణం పెద్దగా ఉంటుంది.

DK Shivakumar Drive Toyota Innova Hycross

టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) అనేది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 172 Bhp పవర్ మరియు 205 న్యూటన్ మీటార్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. హైక్రాస్ నాన్ హైబ్రిడ్ వెర్షన్ 16.13 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ అట్కిన్సన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కూడా లభిస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ మరియు సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్స్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి మరిన్ని ఆధునిక సేఫ్టీ ఫీచర్ ఉంటాయి.

భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికి కూడా మంచి ఆధారణ పొందుతోంది. దీనికి ప్రధాన కారణం మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు ఉత్తమ పనితీరు అని తెలుస్తోంది. ఈ కారును కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 20, 2024, 13:30 [IST]
English summary
Karnataka deputy cm dk shivakumar drive toyota innova hycross
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+