Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?
భారతదేశంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కానీ చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించరు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా ఉండటానికి హెల్మెట్ ధరించకపోవడం కూడా ప్రధాన కారణం.

ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేటప్పుడు 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు హెల్మెట్ ధరించడం ఖచ్చితంగా అవసరం. మోటారు వాహనాల చట్ట సవరణ ప్రకారం కూడా 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

ద్విచక్ర వాహనాల భద్రత కోసం ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కర్ణాటక రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇకపై హెల్మెట్ ధరించాలి. ఒక వేళా ఈ హెల్మెట్ నిబంధనను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
MOST READ:లాంగ్ ట్రిప్స్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి మరిచిపోకండి

డ్రైవింగ్ లైసెన్స్‌ను నిలిపివేయడం మాత్రమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారికి రూ. 1000 జరిమానా విధించబడుతుంది.

కర్ణాటక ప్రభుత్వం జరిమానాను రూ. 500 వరకు విధించింది. ప్రస్తుతం కర్ణాటకలో 1.6 కోట్ల ద్విచక్ర వాహనాలు నమోదయ్యాయి. వీటిలో 60 లక్షల ద్విచక్ర వాహనాలు బెంగళూరులో ఉన్నాయి.
MOST READ:జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

బెంగళూరులో ద్విచక్ర వాహనాలపై నమోదైన కేసుల సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతోంది. 2018 లో 16.4 లక్షలు, 2019 లో 20.3 లక్షల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 20.7 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నిబంధనలను కఠినతరం చేసినందున, రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు రక్షణ కల్పిస్తాయి. ప్రమాదాల సమయంలో తలకు తగిలే గాయాలను నివారిస్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని గ్రహించి హెల్మెట్‌తో ప్రయాణించాలి. ఇది జరిమానాలు చెల్లించకుండా చేస్తుంది. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలలో మరణాల రేటు తగ్గుతుంది. వాహనాద్రాలు తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలి.
MOST READ:మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..