ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి: కర్ణాటక మినిస్టర్

కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ మీడియా కెమెరా ముందుకొచ్చి ఊహనించి డిమాండ్ చేశాడు. కొత్తగా మంత్రి పదివి బాధ్యతలు చేపట్టిన నాయకులకు అధికారిక కారుగా టయోటా ఇన్నోవా వాహనాన్ని కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం

By Anil Kumar

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ పార్టీకి కూడా మెజారిటీ లభించకపోవడంతో కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీలు కలిసికట్టుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

జేడీఎస్ నాయకుడిగా హెచ్‌డీ కుమారస్వామి అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపడితే, మొదటిసారిగా మంత్రి వర్గంలో చోటు లభించిన వారిలో చాలా వరకు కొత్త నాయకులే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్స్(DPAR) నూతన మంత్రి వర్గానికి టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాలను ఇవ్వాలని నిర్ణయించింది.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

మొదటిసారి మంత్రిగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు మరియు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ మీడియా ముందుకొచ్చి ఊహించని డిమాండ్ చేశాడు. కొత్తగా మంత్రి పదివి బాధ్యతలు చేపట్టిన నాయకులకు అధికారిక కారుగా టయోటా ఇన్నోవా వాహనాన్ని కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టయోటా ఫార్చ్యూనర్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

పత్రికా సమావేశంలో జమీర్ అహ్మద్ మాట్లాడుతూ, "DPAR కేటాయిస్తున్న వెహికల్ చాలా చిన్నది అయితే మాజీ ముంఖ్యమంత్రి సిద్దరామయ్య ఉపయోగించిన టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కేటాయిస్తే బాగుటుందని తెలిపాడు."

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

ఆ తరువాత తన డిమాండుకు వివరణ ఇస్తూ, గతంలో పెద్ద ఎస్‌యూవీలలో ప్రయాణించడం బాగా అలవాటైపోయింది. దాంతో తనకు ఇన్నోవా క్రిస్టా చిన్నదైపోయి, అసౌకర్యంగా ఉంటుంది. చెప్పాలంటే లాంగ్ జర్నీకి ఫార్చ్యూనర్ కంటే ఇన్నోవా క్రిస్టానే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

జమీర్ అహ్మద్ మంత్రి పదవి చేపట్టక ముందు చాలా వరకు అత్యంత విలాసవంతమైన పెద్ద పెద్ద వాహనాలలో ప్రయాణించే వాడు. అయితే, మంత్రి పదవి వరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఇన్నోవా వాహనాన్ని కేటాయించింది. దాంతో పెద్ద పెద్ద వాహనాలలో తిరిగే ఆయన చిన్న వాహనంలో ప్రయాణించాలంటే నామోషీగా ఫీలయ్యాడో ఏమో... మీడయా ముందుకొచ్చి మరీ పెద్ద వెహికల్ కావాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశాడు.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

రెండు మోడళ్లు కూడా ఆయా సెగ్మెంట్లలో బాగా అమ్ముడుపోతున్నాయి...

టయోటా ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ రెండు మోడళ్లకు మంచి పాపులారిటీ లభించింది మరియు ఆయా సెగ్మెంట్లలో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇన్నోవా క్రిస్టా క్యాబ్ సర్వీసులకు మరియు వ్యక్తిగత అవసరాలకు బాగా అమ్ముడవుతోంది.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

కొత్త తరం ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కూడా పోటీగా ఉన్న ఇతర మోడళ్ల కంటే మంచి ఫలితాలు సాధిస్తోంది. రెండింటిలో కూడా శక్తివంతమైన ఇంజన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ మరియు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇన్నోవా సరిపోవడం లేదు కాస్త పెద్ద కారు ఇవ్వండి

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ ప్రారంభ ధర రూ. 14.33 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.69 లక్షలు. అదే విధంగా టయోటా ఫార్చ్యూనర్ ధరల శ్రేణి రూ. 26.64 లక్షల నుండి రూ. 32.43 లక్షల మధ్య ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: karnataka minister complaints about toyota innova wants fortuner
Story first published: Saturday, June 23, 2018, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X