కర్ణాటక మంత్రులకు జాక్‌పాట్; కొత్త టొయోటా ఇన్నోవాలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాత్రం రూ.24 లక్షల విలువ చేసే టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని ఇచ్చారు. అయితే, ఇలా మంత్రులకు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కాంగ్రెస్ విజయం సాధించక మునుపే జగదీష్ షెట్టార్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడే నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈలోపుగా ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ మంత్రులకు డబుల ధమాకా మాదిరిగా ఈ ఆఫర్ లభించింది.
ఇదివరకటి ప్రభుత్వంలో మంత్రులు ఉపయోగించిన టొయోటా సెడాన్లు, ఇన్నోవాలు వాటి రన్నింగ్ పీరియడ్‌ను పూర్తి చేసుకొని, ఎక్కువ తిరిగేశాయని అందుకే వాటి స్థానంలో కొత్త వాహనాలను పరిచయం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మంత్రుల కార్యకలాపాలు, పనితీరును దృష్టిలో ఉంచుకొని వారికి ఎమ్‌యూవీలే సరైనవి, వీటిల్లో అయితే మంత్రితో పాటు ఐదారుగురు మద్దతుదారులు కూర్చునే అవకాశం ఉంటుందని అందుకనే వాటిని ఎంచుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ 20 కొత్త వాహనాలను మంత్రుల క్యాబినెట్ ర్యాంక్‌ను బట్టి ఇవ్వటం జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 8 మంది మంత్రులకు మాత్రం సెకండ్ హ్యాండ్ కార్లనే ఇవ్వనున్నారు. ఇది వరకటి ప్రభుత్వం వాళ్లు ఉపయోగించిన వాటిలో మంచి వాటిని వారు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కేవలం మంత్రులకే కాకుండా, డిడి, ఐజి, సిటీ పోలీస్ కమీషనర్స్, డిసిలు, ఎస్‌పిలు, సెక్రటేరియట్స్ మరియు ప్రిన్సిపల్ సెక్రటేరియట్స్‌కు కూడా ఎమ్‌యూవీలను ఇవ్వటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








