రిచ్ పొలిటీషియన్ గ్యారేజిలో చేరిన కొత్త కారు - ధర తెలిస్తే షాకవుతారు!
కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న 'ఎంటీబీ నాగరాజ్' ఇటీవల సరికొత్త 'రేంజ్ రోవర్' లగ్జరీ కారుని సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
ఎంటీబీ నాగరాజ్ కర్ణాటకలో పేరుమోసిన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, కార్ల మీద ఎక్కువ మక్కువ కలిగిన ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా, ఈ కారణంగానే నాగరాజ్ ఎప్పటికప్పుడు ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ సరికొత్త రేంజ్ రోవర్ (Range Rover) లగ్జరీ కారుని కొనుగోలు చేశారు.

ఎంటీబీ నాగరాజ్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారుని ల్యాండ్ రోవర్ డీలర్ డెలివరీ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతోంది. ఇందులో మంత్రి నాగరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులు కారును డెలివరీ చేసుకునే సన్నివేశాలు చూడవచ్చు. అయితే వీరు కొనుగోలు చేసిన కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంది, వేరియంట్ ఏంటనేది అధికారికంగా వెల్లడి కాలేదు.
సరికొత్త రేంజ్ రోవర్ కారు ప్రారంభ ధర రూ.2.39 కోట్లు కాగా.. టాప్ మోడల్ ధర రూ.4.17 కోట్లు (ఎక్స్ షోరూమ్). చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిలో పాటు.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన 35 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం ఉన్నాయి.

పైన వెల్లడించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో హెడ్స్ ఆఫ్ డిస్ప్లై, మల్టి జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క పటిష్టమైన భద్రతను నిర్థారిస్తాయి.
ఎంటీబీ నాగరాజ్ గ్యారేజిలోని మరిన్ని కార్లు..
ఎంటీబీ నాగరాజ్ కొత్త కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే ఈయన గ్యారేజిలో అన్యదేశ్య కార్లైనా రోల్స్ రాయిస్, ఫెరారీ, బెంట్లీ, ఫోర్స్చే కయెన్. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్350 సీడీఐ వంటి వాటితో పాటు టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకి ఓమ్ని వంటి కార్లు కూడా ఉన్నాయి.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII
మినిష్టర్ నాగరాజ్ గ్యారేజిలోని ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ VIII. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 563 Bhp పావుర మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక రోల్స్ రాయిస్ కార్ల డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు.
ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో & ల్యాండ్ రోవర్ డిఫెండర్
నాగరాజ్ గ్యారేజిలోని ఖరీదైన సూపర్ కారు ఫెరారీ కంపెనీకి చెందిన ఎఫ్8 ట్రిబ్యూటో. ఇది 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 710 Bhp పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సూపర్ కారు ప్రారంభ ధర రూ.4.02 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారుతో పాటు మంత్రి గ్యారేజిలో గోండ్వానా స్టోన్ మెటాలిక్ షెడ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఉంది.
పోర్స్చే కయెన్ & బెంట్లీ కాంటినెంటల్ జీటీ
పోర్స్చే కయెన్ మరియు బెంట్లీ కాంటినెంటల్ జీటీ కూడా నాగరాజ్ గ్యారేజిలో ఉన్నాయి. పోర్స్చే కయెన్ 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ కలిగి 340 Bhp పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక బెంట్లీ కాంటినెంటల్ జీటీ విషయానికి వస్తే.. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో డబ్ల్యు12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 500 Bhp మరియు 660 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








