గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక గవర్నమెంట్, ఏంటో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపించడం వల్ల దాదాపు నెల రోజులకుపైగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. కాబట్టి భారత ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ నుంచి కొన్ని సేవలకు మినహాయింపు ఇచ్చారు. కాబట్టి కొన్ని సంస్థలకు లాక్ డౌన్ నుంచి బయట పడ్డాయి. ఇందులో భాగంగా కొన్ని చిన్నపాటి కర్మాగారాలు కూడా తెరుచుకున్నాయి.

సాధారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా వాహన సేవలు రద్దు చేయబడ్డాయి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకోసం ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్) మరియు వ్యవసాయ రంగంలోని పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 తర్వాత తొలిసారిగా 2,500 కు పైగా సంస్థలు ప్రారంభమవుతున్నప్పటికీ, కార్మికుల కొరత ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడటానికి ముందు చాలా కంపెనీలు ముందు జాగ్రత్త చర్యగా కార్యకలాపాలను నిలిపివేసాయి.

లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఈ కర్మాగారాల్లోని కార్మికులు మరియు సిబ్బంది తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. బస్సులు, ట్రైన్లు మరియు విమానయాన సేవలు రద్దు చేయబడ్డాయి. దీనివల్ల కార్మికులు కర్మాగారాలకు తిరిగి రావడం కష్టమవుతుంది.

వచ్చే వారం నుండి రాష్ట్రంలో మరో 3 వేల కర్మాగారాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సంస్థలు ప్రారంభించడం వల్ల మళ్ళీ కార్మికుల కొరత ఉంటుంది. ఈ పరిస్థితిని బట్టి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకురావడానికి రవాణా సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

అనేక సంస్థలు తమ కార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నాయి, అని ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. కంపెనీలకు సహాయం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం కూడా తెలిపింది.
ఎప్పటిలాగే పరిశ్రమలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రతిపాదన చేసినట్లు వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం విద్యుత్ మరియు నీటి బిల్లులు మరియు కొన్ని పన్నులకు మినహాయింపు ఇస్తుంది.

పారిశ్రామికవేత్తలు 2,500 పారిశ్రామిక యూనిట్ల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరుతున్నారు. కరోనా వైరస్ సంక్రమణకు భయపడి కార్మికులు కర్మాగారాలకు రానందున చాలా కర్మాగారాలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ త్వరలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయినట్లైతే కర్మాగారాలన్నీ మల్లి పునఃప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications








