కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

కరోనా మహమ్మారి భారతదేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింత పెరుగుతున్న తరుణంలో, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మరి వ్యాప్తిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించబడింది.

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ నివారించడానికి ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్త చర్యలు కూడా అమలు చేసింది. ఇందులో భాగంగానే కర్ణాటకలో ఏప్రిల్ 10 నుండి 20 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ సమయంలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉంటాయి.

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

కర్ణాటకలో విధించనున్న ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. అదికూడా బెంగళూరుతో సహా మైసూర్, మంగళూరు, తుమ్కూర్, బీదర్, కలబురగి, ఉడిపి మరియు మణిపాల్ జిల్లాలలో నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన సర్వీసులు మినహా మిగిలినవన్నీ పూర్తిగా నిషేధించబడుతుంది.

MOST READ:వావ్.. ఎంజి సైబర్‌స్టర్ సూపర్ కార్.. మైండ్‌బ్లోయింగ్

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

ఈ నైట్ కర్ఫ్యూతో ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు తప్పి ఇతర వాహనాలకు చోటు ఉండదు. అంతే కాకుండా ఈ సమయంలో ఎమర్జెన్సీ పాస్ లు కూడా జరీ చేయబడవు. అయితే ఈ సమయంలో ట్రైన్ జర్నీ మరియు విమాన ప్రయాణానికి అనుమతి ఉంది. కానీ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ చూపించాలి.

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

కరోనా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రజలు కూడా ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి. ఏదైనా అవసరాలు ఉంటే వీలైనంత వరకు పగటి పూట పూర్తి చేసుకోవడం చాలా వరకు మంచిది. ఎదుకంటే ఈ మహమ్మారి వ్యాప్తి చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనిని నివారించడానికి ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోకతప్పదు.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

కావున ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఈ నియమాలను ఉల్లంఘించినట్లైతే వారి వాహనాలు జప్తుచేయబడతాయి. అంతే కాకుండా జరిమానాలు కూడా విధించబడతాయి.

కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

గత ఏడాది ఇలాంటి సమయంలోనే పోలీసులు వేల సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా అధికంగా వ్యాపిస్తున్న కరోనా నివారణ కోసం విధించిన ఈ లాక్ డౌన్ ఉల్లంఘిస్తే మునుపటి లాగే చర్యలు తీసుకుంటారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరిస్తూ కరోనా నివారణలో పాలు పంచుకోవాలి. అప్పుడే కరోనాను నివారించడం సులభం అవుతుంది.

MOST READ:పెట్రోల్ బంక్‌లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్

Most Read Articles

English summary
Karnataka Govt Imposes Night Curfew In Bengaluru. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X