బెంగళూరులో వెహికల్ టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

భారతదేశంలో మోటార్ వాహన చట్టం యొక్క నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇందులో భాగంగానే నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్స్ కి తీసుకెళ్తారు. ఈ విషయం అందరికి తెలుసు. అయితే ఇప్పుడు బెంగళూరులో ఈ విధానానికి స్వస్తి పలికింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

నివేదికల ప్రకారం, నో పార్కింగ్ మరియు వాహనాల టోయింగ్‌కు సంబంధించిన కొత్త విధానాలు మరియు నిబంధనలపై కర్ణాటక ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కారణంగానే 15 రోజుల పాటు టోయింగ్‌ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇకపైన వెహికల్ టోయింగ్ ప్రక్రియను సరళీకృతం చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారం.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

'నో పార్కింగ్' జోన్‌లో పార్కింగ్ చేసిన వాహనాలను టోయింగ్ ప్రక్రియ కింద తీసుకెళ్తారు. అయితే ప్రస్తుతం నో పార్కింగ్ కోసం చలాన్‌లను డిజిటలైజ్ చేశారు, ఈ కారణంగా చలాన్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. చలాన్ లు ఎక్కువ సంఖ్యలో వసూలు చేస్తున్నప్పటికీ ఈ సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ప్రస్తుతం ఉన్న వెహికల్ టోయింగ్ సిస్టమ్ పాతబడిపోయిందని, ఈ కారణంగా ఎంతోమంది వాహనదారులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

ప్రస్తుతం చాలా వరకు వెహికల్ టోయింగ్‌ పనులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థలు రాంగ్‌ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తీసుకెళ్లే పనిని చేస్తున్నాయి. అయితే చాలా సార్లు ఈ కాంట్రాక్టర్లు వాహనాలను అనవసరంగా కూడా తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో వాహనదారులు తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తోంది.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

వాహనాలను డ్రాప్ చేయడానికి కాంట్రాక్టర్లు మరియు ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నట్లు ప్రజల నుండి ఎక్కువ సంఖ్యలో కంప్లైంట్ వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. వాహనాన్ని అనవసరంగా తీసుకెళ్లడం, ప్రవర్తన సరిగా లేకపోవడంపై వాహనదారులు ఫిర్యాదు చేశారు.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

ప్రస్తుతం బెంగుళూరులో 100 కు పైగా టోయింగ్ వాహనాలు నడుస్తుండగా వాటిలో చాలా వరకు సక్రమంగా పనిచేయకపోవడంతో తరచూ వాహనదారులు వేధింపులకు గురవుతున్నారు. ఇది కాకుండా, కాంట్రాక్టర్‌పై ఉద్దేశపూర్వకంగా వాహనానికి నష్టం కలిగించారని ప్రజలు అనేక ఫిర్యాదులు కూడా చేశారు. వాహనాలకు కూడా ఎక్కువ నష్టం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందించి డ్రైవర్ల సమస్యను పరిష్కరిస్తామని కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర హామీ ఇచ్చారు.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

అంతే కాకుండా టోయింగ్‌కు సంబంధించి ప్రజలు ఇప్పటివరకు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనాలని కూడా వారు తెలిపారు. ట్రాఫిక్‌, టోయింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ప్రాథమిక చర్చలు జరిగాయని, ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపిన తరువాత త్వరలో ఒక నిర్ణయం ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

డిజి-ఐజిపి ప్రవీణ్ సూద్, బెంగుళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ మరియు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)తో ఈ సమస్యకు సంబంధించి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడిన సమావేశం ఫలితంగా ఈ నిర్ణయం వచ్చింది. రానున్న 15 రోజుల్లో టోయింగ్‌ సిస్టమ్‌ను సులభతరం చేయనున్నారు. కావున కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత వాహనదారులు అక్రమాలనుంచి విముక్తి పొందవచ్చు.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

ప్రస్తుతం దేశం టెక్నాలజీ పరంగా చాలా వేగంగా ముందుకు వెళుతోంది. అయితే ఈ కాలంలో కూడా వెహికల్ టోయింగ్ అనేది చాలా పాత పద్ధతి. దీనికి చరమగీతం పాడటానికి కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున దీనికి కూడా కొత్త టెక్నాలజీ త్వరలోనే అందుబటులో రానుంది. అప్పుడు ఈ టోయింగ్ ప్రక్రియ పూర్తిగా కొత్త విధానంలోకి వచ్చేస్తుంది.

బెంగళూరులో టోయింగ్ విధానానికి స్వస్తి: అప్పటి వరకు మాత్రమే

పార్కింగ్ చట్టాలలో సంస్కరణలు చేయవలసిన అవసరం బెంగళూరు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నగరంలో చాలా అవసరం, కావున ఈ కొత్త టెక్నాలజీ త్వరలోనే అమలులోకి వస్తుందని ఆశిస్తున్నాము. ఇప్పటికే దీనిపైనా చర్చలు కూడా జరుగుతున్నాయి. కావున ఈ కొత్త విధానం ఏ సమయంలో అయినా అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 5, 2022, 12:28 [IST]
English summary
Karnataka suspended vehicle towing temporarily new policies soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+