కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ కదా [వీడియో]

పెంపుడు జంతువులంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు, చాలా మంది కుక్కలు, పిల్లులు మరియు కుందేళ్లు వంటి వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు దగ్గర ఉన్న పెంపుడు జంతువులు కూడా నిజానికి పెద్ద సెలబ్రెటీలే.. ఎందుకంటే అవి కూడా చాలా లగ్జరీ జావితాన్ని అనుభవిస్తాయి. ఇటీవల ఒక పెంపుడు కుక్క దాదాపు రూ. 4 కోట్ల కారు పైన కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

నిజానికి ఇక్కడ కనిపించే కుక్క పేరు 'కటోరి'. ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ 'కార్తీక్ ఆర్యన్' పెంపుడు కుక్క. ఇటీవల కార్తిక్ తన ఖరీదైన కారు 'మెక్‌లారెన్ జిటి' (McLaren GT) మీద ఉంచి ముద్దు చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా అతడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. స్పాయిల్డ్ కిడ్ కటోరి అంటూ క్యాప్సన్ పెడుతూ 'యే ముఝే కామ్ పే జానే నహీ దేగీ' అని రాసాడు.

ఈ వీడియోకి ఇప్పటికే 16,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కాగా కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో చాలామంది కటోరి చాలా క్యూట్ గా ఉందని అంటున్నారు. నిజానికి వీడియో చూస్తే తప్పకుండా మీరు తప్పకుండా ఇదే అంటారు.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

కార్తీక్ ఆర్యన్ 'మెక్‌లారెన్ జిటి' (McLaren GT) విషయానికి వస్తే, ఇది టి-సిరీస్ చైర్‌పర్సన్ భూషణ్ కుమార్ గిఫ్ట్ గా అందించాడు. ఈ సూపర్ కార్ ధర రూ. 3.73 కోట్లు. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 2 సినిమా భారీ విజయాన్ని సాధించి రూ. 180 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ కారణంగానే కార్తీక్ ఆర్యన్ ఖరీదైన కారు గిఫ్ట్ గా లభించింది.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

కార్తీక్ ఆర్యన్ గిఫ్ట్ గా పొందిన ఈ 'మెక్‌లారెన్ జిటి' (McLaren GT) కారుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ చైనీస్ ఫుడ్ తినడానికి కొత్త టేబుల్‌ గిఫ్ట్ గా లభించిందని, కష్టానికి ప్రతిఫలం ఇంత ఖరీదైనదిగా ఉంటుందని తానూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ టైమ్ ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌ అంటూ రాసాడు.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

కార్తిక్ ఆర్యన్ యొక్క ఈ మెక్‌లారెన్ జిటి సూపర్ కారు భారతదేశంలో విక్రయించబడిన మొదటి మెక్‌లారెన్ జిటి. అంతే కాకూండా ఇది భారతదేశంలో విక్రయించబడిన అత్యంత చౌకైన మెక్‌లారెన్ కారు. ఇది ఆరంజ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. అదే సమయంలో ఇది బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ వంటివి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

మెక్‌లారెన్ జిటి సూపర్ కారు 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ పొందుతుంది. ఇంజిన్ 611 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో పవర్ ఓపెన్ డిఫరెన్షియల్ ద్వారా పవర్ వెనుక చక్రాలకు మళ్లించబడుతుంది. కావున ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 327 కిలోమీటర్లు. ఇది అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

మెక్‌లారెన్ జిటి కారుని ముంబైలోని ఇన్ఫినిటీ కార్స్ నుండి కార్తిక్ ఆర్యన్ కి డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇతని వద్ద అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యు 5 సిరీస్ (BMW 5 Series), మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ (MINI Cooper S Convertible), పోర్స్చే 718 బాక్స్‌స్టర్ (Porsche 718 Boxster) మరియు లంబోర్ఘిని ఉరస్ క్యాప్సూల్‌ (Lamborghini Urus Capsule) వంటి వాటిని కలిగి ఉన్నారు.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

కార్తిక్ ఆర్యన్ వద్ద ఉన్న లంబోర్ఘిని ఉరస్ క్యాప్సూల్‌ విషయానికి వస్తే, ఇది గత సంవత్సరం కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.5 కోట్లు. ఇది 4.0-లీటర్ వి8 ఇంజన్‌తో వస్తుంది. ఇది 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు గరిష్టంగా 305 కిలోమీటర్లు.

కార్తీక్ ఆర్యన్ లగ్జరీ కారుపై పెంపుడు కుక్క.. వెరీ క్యూట్ [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సెలబ్రెటీలు తమ పెంపుడు కుక్కలను ఎలా చూసుకుంటారు అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటికే చాలామందికి సెలబ్రెటీలు పెంచుకునే పెంపుడు జంతువులను గురించి తెలిసే ఉంటుంది. ఆధునిక మహానటి అయిన కీర్తి సురేష్ వద్ద కూడా ఒక క్యూటీ పెంపుడు కుక్క ఉంది. దీనిని గతంలో తన మినీ కూపర్ కారులో తీసుకెళ్లిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు, ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి అప్డేటెడ్ సమచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2022, 13:07 [IST]
English summary
Kartik aaryan pet katori on his new mclaren gt super car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+