రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

బాలీవుడ్ చిత్ర సీమలో ప్రముఖ నటుడుగా పేరుగాంచిన 'కార్తీక్ ఆర్యన్' ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో లంబోర్గినీ ఉరుస్ (Lamborghini Urus) SUV ని కొనుగోలు చేసిన విషయం తెలిసందే. అయితే ఇటీవల కార్తీక్ ఆర్యన్ లంబోర్గినీ ఉరుస్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో లంబోర్గినీ ఉరుస్ బోనెట్ పైన ప్లేట్ ఉంచుకుని ఏదో తింటున్నట్లు తెలుస్తుంది. ఇది చూసిన చాలామంది ప్రజలు డైనింగ్ టేబుల్ అని పిలుస్తున్నారు.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

నివేదికల ప్రకారం, కార్తీక్ ఆర్యన్ తన కారులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి అక్కడ ఏదో తీసుకుని తన లంబోర్గినీ ఉరుస్ కారు యొక్క బోనెట్ పైన ఉంచుకుని తిన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం ప్రారంభించారు. ఈ ఫోటోపై కొంతమంది స్పందిస్తూ, ఇది కార్తీక్ డైనింగ్ టేబుల్ 4.5 కోట్లు అని కామెంట్ చేశారు.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

అంతే కాకూండా మరికొంత మంది ఆర్యన్ చేసిన ఈ పని వల్ల కారు గీతలు పడవచ్చని మరియు కారు యొక్క పెయింట్ చెడిపోవచ్చని అన్నారు. అయితే ఈ ఫోటో మనం చూసిన వెంటనే కార్తీక్ ఆర్యన్ ఫుల్ ఎంజాయ్‌మెంట్‌తో ఆహారాన్ని ఆస్వాదిస్తున్నట్లు గమనించవచ్చు.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

అయితే ఇక్కడ ఉన్న లంబోర్ఘిని ఉరస్ విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ SUV. భారతదేశంలో ఈ కారు ధర రూ. 3.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే అన్ని టాక్సులు కలిపినా తరువాత ఈ కారు ఆన్-రోడ్ ధర రూ. 4.50 కోట్లు అవుతుంది. కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేసిన ఈ SUV నీరో నోక్టిస్ బ్లాక్ షేడ్‌లో ఉంది.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

లంబోర్ఘిని ఉరుస్ ఆకర్షణీయమైన డిజైన్, పనితీరు మరియు ఎక్కువ స్థలం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా చాలామంది వినియోగదారులు ఈ ఎస్‌యూవీని ఇష్టపడతారు. లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ 4.0-లీటర్, 8-సిలిండర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిమీ. ఇది కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

భారతదేశంలోని చాలా మంది సినీ తారలు మరియు వ్యాపారవేత్తలు లంబోర్ఘిని ఉరస్ కారును కలిగి ఉన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, దేశంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ వంటివి వారు కూడా ఉన్నారు. ఈ కారులో ఆఫ్-రోడింగ్ కోసం వివిధ డ్రైవింగ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. లంబోర్ఘిని ఉరస్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క MLB Evo ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

లంబోర్ఘిని ఉరుస్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లను పొందుతుంది. ఈ కారు డిజైన్ లంబోర్ఘిని హురాకాన్ సూపర్‌కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరస్ విలాసవంతమైన 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 22 ఇంచెస్ మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను ఆప్సన్స్ గా పొందుతుంది.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తన హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్‌ను ఈ ఏడాది భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 3.54 కోట్లు. లంబోర్గినీ బ్రాండ్ నుంచి అమ్ముడైన మోడల్ ఈ హురాకాన్ ఇప్పటివరకు ఇది చాలా వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో ఎక్కువ భాగం ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తాయి.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

లంబోర్ఘిని హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్ లోపల 8.4 ఇంచెస్ హెచ్‌ఎంఐ టచ్‌స్క్రీన్ ఉంది. ఇది టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఆపిల్ కార్ప్లే కోసం కనెక్టివిటీని వంటివి అందిస్తుంది. ఇందులో ఉన్న సీట్లు బ్లాక్ కలర్ ఉండి రెడ్ స్టిచ్చింగ్ కలిగి ఉంటుంది. ఇందులో కస్టమర్ కావలసిన ఎక్స్టీరియర్ కలర్ ఎంచుకోవచ్చు. ఇందులో 300 డిఫరెంట్ కలర్స్ అందుబాటులో ఉంటాయి.

రూ. 4.5 కోట్ల కారుని డైనింగ్ టేబుల్‌గా చేసుకున్న కార్తిక్ ఆర్యన్

లంబోర్ఘిని హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 602 బిహెచ్‌పి శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 560 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 324 కిమీ వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Kartik aryan eats on lamborghini urus bonnet images gone viral details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X