YouTube

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

చాలామంది యువకులు సాధారణంగా వారిలోని అసాధారణ ప్రతిభతో అసాధారణ కార్యక్రమాలు చేసి ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన చాలా విషయాలు మునుపటి కథనాల్లో చూసాం.. ఇదే తరహాలో ఇప్పుడు కాశ్మీర్‌కు చెందిన ఒక యువకుడు కేవలం 8 రోజుల్లో సైకిల్ పై కన్యాకుమారి చేరుకున్నాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

నివేదికల ప్రకారం కాశ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేసి కొత్త రికార్డును కైవసం చేసుకున్నాడు. సైకిల్‌తో ఈ కొత్త రికార్డు సొంతం చేసుకున్న ఈ యువకుడి పేరు ఆదిల్ తేలి. యితడు సైకిల్ పై కాశ్మీర్‌లో బయలుదేరి కేవలం ఎనిమిది రోజుల 1 గంట, 37 నిమిషాల్లో 3,600 కిలోమీటర్లు ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నాడు.

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

ఇంత తక్కువ సమయంలో సైకిల్ పై కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి చేరుకున్న ఆ యువకుడి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. ఆదిల్ తేలి కాశ్మీర్‌లోని బుడ్గం జిల్లాలో నివసిస్తున్నట్లు తెలిసింది.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

ఆదిల్ తేలి మార్చి 22 న ఉదయం 7:30 గంటలకు శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద ఘంట ఘర్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి మార్చి 30 ఉదయం 9 గంటలకు కన్యాకుమారికి చేరుకున్నారు. ఆయన ప్రయాణానికి కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ కాశ్మీర్ పాండురంగ్ నాయకత్వం వహించారు.

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేగంగా సైక్లింగ్ చేసిన ప్రపంచ రికార్డును గతంలో నాసిక్ యొక్క 17 ఏళ్ల ఓం మహాజన్ సొంతం చేసుకున్నాడు. ఓం మహాజన్ ఎనిమిది రోజుల, 7 గంటల, 38 నిమిషాల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు ఆదిల్ తేలి ఎనిమిది రోజుల 1 గంట, 37 నిమిషాల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి చేరుకొని రికార్డ్ బద్దలుకొట్టాడు.

MOST READ:శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

ఈ రికార్డును సొంతం చేసుకోవడానికి ఆదిల్ పంజాబ్‌లోని అమృత్సర్‌లో సుమారు ఐదు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో గిన్నిస్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది మార్చిలో దరఖాస్తు ఆమోదించబడింది.

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

తన ప్రయాణంలో ఆదిల్ ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, హైదరాబాద్ మరియు మదురైతో సహా పలు నగరాల గుండా వెళ్ళాడు. అతనితో పాటు ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్, మెకానిక్ మరియు కెమెరా సిబ్బంది ఉన్నారు. ప్రయాణం అంతా మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఆదిల్‌తో కలిసి ఉన్నారు.

MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన 'గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

దీనికి సంబంధించి సమాచారం ప్రకారం, కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ఆదిల్ ప్రయాణాన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ స్టోరేజ్ కంపెనీ, కాశ్మీర్ యొక్క అబ్రా అగ్రో స్పాన్సర్ చేసింది. ఆదిల్ తేలి సైకిల్‌తో రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, అతను 2019 లో అత్యంత వేగవంతమైన సైక్లిస్ట్‌గా కొత్త రికార్డు సృష్టించాడు, శ్రీనగర్ నుండి లేహ్‌కు కేవలం 26 గంటల 30 నిమిషాల్లో 440 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించాడు

సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

ఈ రికార్డు మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడానికి అతన్ని మరింత ప్రేరేపించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు గిన్నిస్ రికార్డ్స్‌లో తన పేరు నిలిపాడు. ఏది ఏమైనా అంత దూరం ప్రయాణం 8 రోజుల్లో అంటే నిజంగా అనన్యసామాన్యమనే చెప్పాలి. ఆదిల్ తేలి మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

MOST READ:భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

Image Courtesy: Adil Teli

Most Read Articles

English summary
Kashmir Youth Sets New Record By Travelling Kashmir To Kanyakumari Through Bicycle In 8 Days. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X