భర్తపై ప్రేమ అంటే ఇలా ఉండాలి.. ఆ జంటను చూసి నేర్చుకోండి అంటున్న నెటిజన్లు!

భారతదేశంలో బాలీవుడ్ నటులు, నటీమణులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఖరీదైన కార్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతే కాకుండా సినిమాలు ఏదైనా హిట్‌ అయినా లేదా గిఫ్ట్‌గా తమకు ఇష్టమైన వారికి కూడా అత్యంత ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అంతే కాకుండా కొంత మంది నటీ నటులు వారి కుటుంబంలోని వారికి ఖరీదైన కారును గిఫ్ట్స్‌గా ఇచ్చి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి తన భర్తకు కారుని గిఫ్ట్‌గా ఇంచ్చి వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్‌లో కత్రినా కైఫ్‌కి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. తాజాగా ఆమె తన భర్త విక్కీ కౌశల్‌కి చాలా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది. దీంతో ఆమె వార్తల్లో నిలిచారు. అదే రేంజ్ రోవర్. ఈ ఎస్‌యూవీ లగ్జరీ కేటగిరీకి చెందినది. ఇక ఆమె భర్త విక్కీ కౌశల్ కూడా బాలివుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులుగా ఉన్నారు.

Katrina kaif Gifted Range Rover to Vicky Kaushal

ఆయన బహుమతిగా ఇచ్చిన రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీ అత్యంత ఖరీదైన కారు. కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌కి రేంజ్ రోవర్ 3.0 LWD ఆటోబయోగ్రఫీ వేరియంట్‌ని బహుమతిగా ఇచ్చింది. ఈ కారు ధర భారత మార్కెట్‌లో రూ.2.60 కోట్ల ఎక్స్‌-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.3.25 కోట్ల వరకు ఉంటుందని ఇక్కడ గమనించాలి.

ఈ కారు 3.0-లీటర్ ఆరు సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 394 bhp పవర్, 550 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ఇంజిన్ ద్వారా ఉత్పత్తయ్యే శక్తి కారు నాలుగు చక్రాలకు శక్తిని పంపుంతుంది. ఈ కారు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

Katrina kaif Gifted Range Rover to Vicky Kaushal

ఇది ధరలో ఖరీదైన లగ్జరీ కారు కావడంతో అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. ఇందులో 13.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణీకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, 35-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌కి రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ముంబై రోడ్లపై ప్రయాణిస్తుండగా ఈ వీడియో తీశారు. కానీ కారులో కత్రినా కైఫ్ గానీ, విక్కీ కౌశల్ గానీ కనిపించలేదు. ఈ కారుని కొద్ది రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారుతో ఆమె దిగిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

అయితే విక్కీ కౌశల్ వద్ద ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, బీఎండబ్ల్యూ 5 సిరీస్ జీటీ, ఆడి క్యూ7 వంటి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో కత్రినా కైఫ్ కూడా ఇచ్చిన కారు కూడా వచ్చి చేరింది. ఈ హీరోకి కార్లంటే ఎక్కువ ప్రేమ. ఆయన గ్యారేజీలో కొత్త కారు రాకతో లైనప్‌ మరీ పెరిగింది.

అయితే భర్త విక్కీ కౌశల్‌కి కత్రినా కైఫ్‌ గిఫ్ట్‌గా కారు ఇవ్వడంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. భర్తపై ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ కొందరు.. భర్తకు ఏం కావాలో భార్య తెలుసుకోవాలని కొందరు కామెంట్‌ చేశారు. మరికొందరు ఇలాంటివి కామన్‌ అంటూ రాసుకొచ్చారు. ఇంకొందరు వాళ్లంటే డబ్బున్నోళ్లు బ్రో అంటూ తమదైన స్టైల్‌లో పంచ్‌లు విసిరారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 25, 2024, 16:30 [IST]
English summary
Katrina kaif gifts range rover suv to vicky kaushal video gone viral
Read more on: #celebrity car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+