రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ను రైడ్ చేస్తున్న బాలీవుడ్ భామ కత్రినా

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. దేశంలో ఎన్ని కొత్త బ్రాండ్‌లు వచ్చినా బుల్లెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆకట్టుకునే లుక్స్ అద్భుతమైన పవర్ ఈ రెండు బుల్లెట్ బైక్‌కు పెద్ద అసెట్స్. ఇంచు మించు ఓ చిన్నకారు ఇంజన్ సీసీ ఉండే బుల్లెట్ బైక్‌ను హ్యాండిల్ చేయాలంటే అందుకు తగిన పర్సనాలిటీ కూడా ఉండాలి. మరి ఇలాంటి ఓ అందమైన బైక్‌ను మరో అందమైన భామ రైడ్ చేస్తుంటే ఎలా ఉంటుంది. జర జర టచ్ మి.. టచ్ మి.. జర జర హోల్డ్ మి... హోల్డ్ మి.. అంటూ హాట్ హాట్ సాంగ్‌కు తన సెక్సీ సెప్టులతో హీటెక్కించిన మన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఎంచక్కా ఎవరి మద్దతు లేకుండా ఈ భారీ బైక్‌ను ఎలా రైడ్ చేస్తుందో చూడండి. కత్రినా కైఫ్ తాజా చిత్రం "జిందగీ నా మిలేగీ దుబారా" కోసం స్పెయిన్ రహదారులపై ఈ క్రూయీజ్ బైక్‌పై ఆమె రయ్.. రయ్.. మంటూ షికార్లు చేసేస్తోంది. ఇందుకోసం కత్రినా ప్రత్యేకంగా డ్రైవింగ్ క్లాసులు కూడా తీసుకున్నట్లు సమాచారం. కత్రినా రైడ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు ఉచిత ప్రచారం లభించినట్లయింది.


Click it and Unblock the Notifications








