లక్ అంటే ఇతనిదే.. రూ. కోటితో పాటు ప్రముఖ బ్రాండ్ కారు గిఫ్ట్..
కారు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నిత్య అవసరంగా మారిపోయింది. కుటుంబ అవసరాల కోసం, ఆఫీసు పని మీద కస్టమర్లు కారు కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. అయితే మధ్యతరగతి వారికి కారు కొనుగోలు చేయడమనేది హై బడ్జెట్ విషయమా.. కానీ అదృష్టం బాగుండి కారు గిఫ్ట్‌గా వస్తే.. అందులో వచ్చే కిక్కే వేరు.
కౌన్ బనేగా కరోడ్‌పతి(Kaun Banega Crorepati) ప్రసిద్ధ టీవీ షోలలో ఒకటి. ఈ షోకు సంబంధించి 15వ సీజన్ ఇటీవలే ప్రారంభం కాగా ఇప్పుడు ముగింపు దశలో ఉంది. తాజాగా ఈ షోలో పాల్గొన్న జస్కరన్ సింగ్ రూ. కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ భారీ బహుమతితో పాటు, అతనికి దేశంలోని ప్రసిద్ధ కారు మోడల్‌ను బహుమతిగా అందించారు. ఆ కారుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా..

కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. కోటి ప్రైజ్ మనీ గెలుచుకున్న జస్కరన్ సింగ్‌కు హ్యుందాయ్ మోటార్ కంపెనీ అతనికి బోనస్ బహుమతిగా హ్యుందాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter) కారును అందించింది. కస్టమర్ల ఫేవరెట్ కారు మోడళ్లలో ఒకటిగా నిలిచిన ఈ కారును బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV కారు. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడళ్లలో ఇది ఒకటి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ మోడల్‌కు పోటీగా అమ్మకానికి వచ్చిన మోడల్. కానీ అడుగు దూరంలో జస్కరన్ సింగ్ మరో భారీ బహుమతిని పోగొట్టుకున్నారు. అదేంటంటే..
షోలో జస్కరన్ సింగ్ రూ. 7 కోట్ల ప్రైజ్ మనీ ప్రశ్నకు సరైన సమాధానం చెబితే హ్యుందాయ్ వెర్నా సెడాన్ కారును బహుమతిగా గెలిచేవారు.ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో దానిని కోల్పోయారు. అందుకే హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారును బహుమతిగా ఇచ్చారు.
ఎక్స్‌టర్ మైక్రో SUV యొక్క టాప్ ఎండ్ ఆప్షన్ అయిన SX(O) కనెక్ట్ ట్రిమ్ జస్కరన్ సింగ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఇది కాకుండా, హ్యుందాయ్ ఈ కారులో సేఫ్టీ ఫీచర్లను కూడా అందించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రెండు డ్యాష్ కెమెరాలు మరియు రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు టాప్ రేంజ్ సేఫ్టీని కలిగిస్తాయి.
ఈ కారులో ఇలాంటి అధునాతన ఫీచర్లు ఉండటం వల్ల దీనికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10.10 లక్షల వరకు విక్రయానికి అందుబాటులో ఉంది. కాగా ఇవి ఎక్స్-షోరూమ్ ధరు మాత్రమే.
హ్యుందాయ్ ఎక్స్‌టర్.. టాటా పంచ్‌తో మాత్రమే కాకుండా రెనాల్ట్ కడ్జర్, నిస్సాన్ మాగ్నైట్, సిట్రోయెన్ C3 మరియు మారుతి సుజుకి ఫ్రాంక్‌ల వంటి వాటికి కూడా గట్టి పోటీనిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ మరియు CNG మోటార్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఇందులో రెండు ఆప్షన్స్ 1.2 లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ మోటార్ ద్వారా శక్తిని పొందుతాయి. 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా అందించబడతాయి. అంతే కాకుండా సరసమైన ధరలో లభిస్తోంది. అటువంటి సూపర్ కారును పోటీలో విజేతకు బహుమతిగా అందించారు.


Click it and Unblock the Notifications








