KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు, చిన్న పొలిటికల్ లీడర్స్ నుంచి చీప్ మినిస్టర్స్ వరకు అందరికి కార్లంటే చాలా ఇష్టం. అయితే అదికాస్త సెలబ్రెటీలకు మరియు రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు కొత్త లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి 'కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్' (KCR) ఇటీవల అత్యంత ఖరీదైన టొయోట బ్రాండ్ కార్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంతకీ KCR కొనుగోలు చేసిన కార్లు.. ఏవి? మొదలైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

తెలంగాణా ముఖ్యమంత్రి KCR ఇటీవల అత్యంత ఖరీదైన 'టయోటా ల్యాండ్ క్రూయిజర్' (Toyota Land Cruiser) కార్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అత్యంత ఖరీదైన కాన్వాయ్ కలిగి ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో KCR కూడా ఒకరుగా ఉన్నారు. గతంలో KCR బ్లాక్ కలర్ 'ఫార్చునర్' వాహనాలను వినియోగించేవారు. అయితే వాటి స్థానంలో ఇప్పుడు కొత్త 'ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' (Toyota Land Cruiser Prado) చేర్చడం జరిగినట్లు సామజిక వర్గాల ద్వారా తెలిసింది.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

కెసిఆర్ కొనుగోలు చేసిన కొత్త 'టొయోట ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' (Toyota Land Cruiser Prado) ధర అక్షరాలా రూ. 1.30 కోట్లు అని సమాచారం. నిజానికి కెసిఆర్ ఇప్పటికే ఒక ఆధునిక సదుపాయాలు కలిగిన ఒక 'కారావ్యాన్' కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు తన కాన్వాయ్ లో అత్యంత ఖరీదైన కార్లు చేరాయి.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

ఈ కొత్త కాన్వాయ్ వాహ‌నాలను తెలంగాణాలో కాకుండా విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో సిద్ధం చేసినట్లు తెలిసింది. వీటిని అక్కడే బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దీని కోసం ఈ ఆధునిక లగ్జరీ కార్లను హైద‌రాబాద్ నుండి ప్ర‌త్యేక కార్గో విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి తీసుకువచ్చి, మ‌ల్ల‌వ‌ల్లి పారిశ్రామిక వాడ‌లో వాహ‌నాల‌కు అవ‌స‌రం అయిన ఫిటింగ్స్ చేసి తిరిగి అదే కార్గో విమానంలో తరలించినట్లు తెలిసింది.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

కెసిఆర్ తమ పార్టీని జాతీయ పార్టీగా చేయనున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది. కావున ప్రస్తుతం దీనిపైన ద్రుష్టి పెట్టడానికి మరియు తమ పార్టీని ఉత్తర భారతదేశంలో కూడా ప్రచారం చేయడానికి ఈ ఆధునిక వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఇది ఎంత వరకు నిజం అనే దానిపైన స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అధికారులు కూడా దీనిపైన ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

ఇక కెసిఆర్ కొనుగోలు చేసిన లగ్జరీ 'టొయోట ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' (Toyota Land Cruiser Prado) విషయానికి వస్తే, ఇవి కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన వాహనాలు. వీటి ధరలు కోటి రూపాయలకు పైగానే ఉన్నాయి. ఇది మొత్తం ఎనిమిది కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉటుంది. అయితే కెసిఆర్ తెలుపు రంగు కార్లను కొనుగోలు చేశారు. గతంలో ఇతను బ్లాక్ కలర్ కార్లను వినియోగించేవారు.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

'టొయోట ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' పరిమాణం పరంగా పెద్దదిగా ఉంటుంది. కావున దీని పొడవు 4,780 మిమీ, వెడల్పు 1885 మిమీ, ఎత్తు 1,880 మిమీ మరియు బూట్ స్పేస్ 620 లీటర్ల వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

ఈ లగ్జరీ కారు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కీ లెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, కూలింగ్ గ్లౌవ్ బాక్స్, ఫ్రంట్ యుఎస్బి ఛార్జర్, రియర్ హీటెడ్ సీట్, రియర్ ఏసీ వెంట్స్, ఎయిర్ క్యాలిటీ కంట్రోలర్ మరియు అడ్జస్టబుల్ స్టీరింగ్ వంటివి ఉన్నాయి.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

'టొయోట ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' 2982 సిసి డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 171 బిహెచ్‌పి పవర్ మరియు 1600 - 2800 ఆర్‌పిఎమ్ వద్ద 410 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

KCR కాన్వాయ్‌లో చేరిన కొత్త వాహనాలు.. ఒక్కొక్కటి రూ.1.30 కోట్లు: ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, బ్రేక్ అసిస్ట్, పవర్ డోర్ లాక్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టం మరియు యాన్తి తెఫ్ట్ డివైస్ మొదలైనవి ఉన్నాయి. కావున ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. మొత్తం మీద 'టొయోట ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో' అన్ని విధాలుగా అనుకూలమైన వాహనం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2022, 13:51 [IST]
English summary
Kcrs convoy to get new toyota cars details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+