ఆటోలో స్టార్‌ హీరోతో కీర్తి సురేష్‌ చక్కర్లు.. కావాలనే అలా వెళ్లారా.. వైరల్‌ అవుతున్న వీడియో

సాధారణంగా హీరో, హీరోయిన్లు, ప్రముఖ వ్యక్తులు బయట చాలా ఖరీదైన లగ్జరీ కార్లలో ప్రయాణిస్తుంటారు. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎమ్‌డబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్ల మోడళ్లు వారి కార్ల గ్యారేజ్‌లో ప్రత్యేకం. కానీ వాళ్లెప్పుడైనా సాధారణ ప్రజల్లా ఆటోలో ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా.??

తమ హిట్‌ సినిమాలతో పెద్ద ఎత్తున క్రేజ్‌ సంపాదించుకున్న ఇద్దరు నటీనటులు అలా ఆటోలో ప్రయాణించారు. ఇది నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వైరల్ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఎవరా హీరో.. ఎవరా హీరోయిన్‌ అనేగా మీ సందేహం. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

Varun-Dhawan-Spotted-With-Keerthy-Suresh

'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్‌(Keerthuy Suresh), బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌(Varun Dhawan) ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగు, తమిళ్‌ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేష్‌ ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. VD18 సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

2024లో విడుదల కానున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతోంది. అలా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అట్లీకి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి ఆదరణ మొదలైంది.

సమాచారం ప్రకారం, అట్లీ అప్‌కమింగ్‌ సినిమా VD 18 షూటింగ్ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లో భాగంగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కలిసి ముంబైలో ఆటోలో ప్రయాణించారు. ఈ వీడియోలో, వరుణ్ ధావన్ చొక్కా లేకుండా కేవలం బనియన్‌తో ఉండటాన్ని మనం చూడవచ్చు.

ఇలా వారిద్దరూ ఆటోలో ప్రయాణిస్తుండగా వారిని చూసి అక్కడే ఉన్న జనం షాక్ అయ్యారు. ఇలాంటి సెలబ్రిటీలను ఆటోలో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేష్‌ ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

బాలీవుడ్‌ నటుడు వరుణ్ ధావన్ వద్ద చాలా ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆడి Q7 (Audi Q7), మెర్సిడెస్‌ బెంజ్‌ GLS 350d 4Matic (Mercedes-Benz GLS 350d 4Matic) మరియు ల్యాండ్ రోవర్ LR3 ఇలా వరుణ్‌ నివాసంలోని గ్యారేజ్‌లో లగ్జరీ కార్లను చూడవచ్చు.

మరోవైపు టాలీవుడ్‌ బ్యూటీ కీర్తి సురేష్ వద్ద బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్7(BMW X7) వంటి లగ్జరీ కారు ఉంది. వరుణ్ ధావన్ మరియు కీర్తి సురేష్‌ సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆటోలో ప్రయాణించడం, డ్రైవ్‌స్పార్క్ తెలుగు సైట్‌ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఆటో ట్రిప్‌ని ఇద్దరూ ఎంజాయ్ చేసి ఉంటారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 17:04 [IST]
English summary
Keerthy suresh and varun dhawan auto ride in mumbai video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+