నేటి వీడియో: కెన్ బ్లాక్ జిమ్ఖానా సిక్స్ 'అమేజింగ్ కార్ డ్రిఫ్ట్'
ఈ వీడియో చూస్తే మీరు ఔరా అని ముక్కున వేలేసుకోవటం ఖాయం. వీడియో గేమ్స్ ప్రియులకు 'నీడ్ ఫర్ స్పీడ్' గేమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యంత పాపులర్ అయిన ఈ కార్ డ్రిఫ్టింగ్ గేమ్‌ను కేవలం కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్‌పైనే కాకుండా రియల్ లైఫ్‌లోను ఆడితే ఎలా ఉంటుంది. ఫుల్ మజా వస్తుంది కదా..!?
అలాంటి ప్రయత్నమే చేశారు నీడ్ ఫర్ స్పీడ్ యాజమాన్యం మరియు కెన్ బ్లాక్‌లు. నీడ్ ఫర్ స్పీడ్ రేసింగ్ అడ్వైజర్ అయిన కెన్ బ్లాక్ 'జిమ్ఖానా అల్టిమేట్ గ్రిడ్ కోర్స్'ను నిర్మించాడు. డ్రైవింగ్ యొక్క స్పీడ్, ఫన్, అడ్వెంచర్, డ్రిఫ్టింగ్ లను రియల్ లైఫ్‌లో అనుభవించేలా ఓ ట్రాక్‌ను వీరు తయారు చేశారు. అంతేకాదు, ఈ ట్రాక్‌పై కెన్ బ్లాక్ తన కారుతో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈ అల్టిమేట్ గ్రిడ్ అబ్‌స్టాకల్ కోర్సు ట్రాక్‌పై అనేక కార్గో కంటైనర్స్, అప్స్ అండ్ డౌన్స్, క్రేన్స్, ప్రొక్లెన్స్‌ను, రెండు కార్లను, సెగ్‌వేలపై వెళ్లే ఇద్దరు వ్యక్తులను ఉంచారు. ఇన్ని అడ్డంకులు కలిగిన ఈ ట్రాక్‌పై కెన్ బ్లాక్ నత ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి ఆర్ఎక్స్43 కారుతో (650 హెచ్‌పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్) అడ్డంకులన్నీ అధిగమించుకుంటూ, కారును జర్రుమని జార్చుతూ దూసుకుపోయే వైనం అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యమెందుకు ఈ అమేజింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి..!!
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/WUO-lPubXeI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>
డ్రిఫ్టింగ్ కోసం కెన్ బ్లాక్ ఉపయోగించిన 2013 ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి ఆర్ఎక్స్43 హ్యాచ్‌బ్యాక్ కారు కేవలం 1.8 సెకండ్ల వ్యవధిలోనే 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే, యాక్సిలరేటర్‌ను టచ్ చేయగానే రాకెట్ మాదిరిగా రయ్యిమని దూసుకుపోతుందన్నమాట.


Click it and Unblock the Notifications








