ఫేస్‌బుక్ వీడియో: కెన్ బ్లాక్ vs నేయ్మర్.. కార్ vs ఫుట్‌బాల్
మనుషులు మనుషులతో ఫుట్‌బాల్ ఆడితే ఆశ్చర్యం లేదు కానీ, మనుషులు కారుతో ఫుట్‌బాల్ ఆడితే మాత్రం అది ఖచ్చితంగా వింతేనని చెప్పాలి. అలాంటి వింతనే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రొఫెషనల్ కార్ డ్రిఫ్ట్రర్ కెన్ బ్లాక్ మరియు బ్రెజిలియన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు నేయ్మర్ డా సిలివా శాంటోస్ జూనియర్‌ల మధ్య ఈ తరహా పోటీ జరిగింది.
ఇది కూడా చూడండి: కెన్ బ్లాక్ జిమ్ఖానా సిక్స్ 'అమేజింగ్ కార్ డ్రిఫ్ట్'
ఇందులో కెన్ బ్లాక్ తన ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి ఆర్ఎక్స్43 స్టంట్ కారుతో ఫుట్‌బాల్ ఆడుతుంటే, నేయ్మర్ మాత్రం నార్మల్‌గా ఫుట్‌బాల్ ఆడుతాడు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆయిల్ సంస్థ క్యాస్ట్రాల్ స్పాన్సర్ చేసింది. ఈ పోటీని క్యాస్ట్రాల్ ఫుట్‌ఖానాగా పిలుస్తున్నారు.
నేయ్మర్ గోల్ చేస్తున్నప్పుడు కెన్ బ్లాక్ తన కారుతో గోల్‌ను బ్లాక్ చేయటం, అలాగే తాను తన కారుతో గోల్ చేయటం చూడటానికి చాలా వైవిధ్యంగా అనిపిస్తుంది. మరి ఆ అమేజింగ్ క్యాస్ట్రాల్ ఫుట్‌ఖానా వీడియోని ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియో శీర్షికలో వీక్షిద్దాం రండి..!


Click it and Unblock the Notifications








