రొమాంటిక్‌ ఫొటోను క్లిక్‌మనిపించిన AI కెమెరా.. ఫొటోగ్రాఫర్ కూడా ఇంత మంచి ఫొటో తీయలేరంటూ నెటిజన్ల కామెంట్లు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత కెమెరాలను కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం తొలిభాగంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను (AI Camera) అమర్చింది. అయితే ఈ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన నుంచి ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. అనేక సార్లు తప్పుడు కారణాలలో వాహనదారులకు జరిమానా విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కెమెరాలు (kerala Artificial intelligence Camera) అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తాజాగా AI కెమెరా ఓ మోటార్‌ సైకిల్‌పై ప్రయాణిస్తున్న దంపతుల రొమాంటిక్‌ ఫోటోను తీసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎంత డబ్బులిచ్చినా.. ఫోటోగ్రాఫర్లు ఇంత మంచి ఫోటో తీయలేరంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Kerala AI Camera captures romantic photo

ఈ ఫోటోను Vandi Bhranthanmar తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేశారు. ఈ ఫోటోకు 500 జరిమానా విధిస్తే మాత్రం ఏమైంది. ఓ గొప్ప ఫోటోగ్రాఫర్‌ కూడా ఇంత అద్భుతంగా ఫోటో తీయలేకపోవచ్చు. AI కెమెరా ఈ ఫోటోను కలర్‌ ఫోటోగా తీసి ఉంటే ఎంతో బాగుంటుందని.. తన ఇంట్లో శుభకార్యం కోసం ఇలాంటి ఫోటోను ఉపయోగిస్తా.. అని ఫోటో క్యాప్షన్ కింద రాసుకొచ్చారు.

చలాన్‌ అందుకున్న బైక్‌ యాజమానికి కూడా ఇలానే స్పందించారా లేదా అనేది తెలియలేదు. అయితే ఇంత చక్కగా ఉన్న ఫోటోకు జరిమానా ఎందుకు విధించారనే అనుమానం మీకు కలగవచ్చు. కేరళ ప్రభుత్వం నిబంధనల ప్రకారం బైక్‌ వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి.

AI Camera clicks romantic photo of a couple

ఈ ఫోటోలో మోటార్‌ సైకిల్‌పై వెనుక సీట్లో కూర్చున్న యువతి హెల్మెట్‌ ధరించలేదు. అందుకే AI కెమెరా చలాన్‌ పంపింది. ఈ ఫోటోను రాత్రి వేళలో తీసినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగులో మాత్రమే ఫోటో కనిపిస్తోంది.

కేరళలో మోటార్‌సైకిల్‌పై హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. అదే బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తే రూ.1000, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడితే రూ.2000 జరిమానా విధిస్తారు. కేరళలో ఏర్పాటుచేసిన AI కెమెరాలు.. ఎటువంటి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కనిపించినా వెంటనే ఫోటో తీసి, డేటా సెంటర్‌కు పంపిస్తాయి. ఎంత రాత్రి సమయంలోనైనా ఈ హైరిజల్యూషన్‌ కెమెరాలు ఫోటోలు తీయగలవు.

Kerala Artificial intelligence camera latest news

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.232 కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. 726 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలను రాష్ట్ర, జాతీయ రహదారులపై ఏర్పాటుచేసింది. ఈ కెమెరాలు అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఈ కెమెరాల పనితీరుపై గతంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 12, 2023, 13:57 [IST]
English summary
Kerala artificial intelligence camera clicks romantic photo of a couple
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+