బైక్‌ వేగం 1240 కి.మీ.. చలాన్‌ విధించిన AI కెమెరా..!! చివరికి..

కొన్ని నెలల క్రితం కేరళ ప్రభుత్వం "సేఫ్‌ కేరళ" ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే 726 కెమెరాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసింది. రోడ్లపైన వాహనదారులు ఎటువంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినా ఈ కెమెరాలు గుర్తించి, ఆటోమేటిక్‌గా చలాన్‌లు పంపిస్తాయి. ఈ ‌‌కెమెరాల పనితీరును తొలుత ట్రయల్‌ నిర్వహించి, అనంతరం అమల్లోకి తీసుకువచ్చారు.

ఈ ఏఐ కెమెరాలు అమల్లోకి వచ్చిన తొలిరోజు సుమారు 38,000 చలాన్‌లను జారీచేశాయి. అయితే తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏఐ కెమెరా ఓ బైక్‌ వేగాన్ని 1240km/h నమోదు చేసింది. ఇలాంటి లోపాలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేస్తున్నారు.

kerala Artificial intelligence camera

బైక్‌ వేగాన్ని 1240 km/hతో నమోదు చేసిన వీడియోలను జైహింద్‌ టీవీ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఆ కెమెరా బైక్‌ ఫోటోను కంట్రోల్‌ రూంకు పంపింది. అక్కడ సిస్టమ్‌ ఓవర్‌ స్పీడ్‌ను గుర్తిస్తూ చలాన్‌ జారీ చేసింది. అయితే తదుపరి విచారణలో వాహనదారుడు ఎలాంటి ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు పాల్పడలేదని, చలాన్‌ జారీ చేయకూడదని తేలింది.

ఏఐ కెమెరాల వ్యవస్థ అమల్లోకి వచ్చిన నుంచి అనేక తప్పులు బయటపడుతున్నాయి. నంబర్‌ ప్లేట్ల పైనున్న స్క్రూలు, బోల్టులను ఏఐ కెమెరాలు తప్పుగా గుర్తిస్తున్నాయి. స్క్రూలను సున్నాలుగా గుర్తిస్తూ చలాన్‌లు విధిస్తున్నాయి. తొలుత ఏఐ కెమెరాల వ్యవస్థ ఆటోమేటిక్‌గా పనిచేస్తుందని. మానవ సాయం అవసరం లేదని పేర్కొన్నారు.

అయితే అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నందున కంట్రోల్ రూంలో ఏఐ కెమెరాలు తీసిన ఫోటోలను పరిశీలించేందుకు మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, AMVIలను నియమించారు. వారు చలాన్‌లు సక్రమంగా జారీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్‌లో ఈ వ‌్యవస్థలోని సమస్యలను పూర్తిగా నివారిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఏఐ కెమెరాల వ్యవస్థ పనితీరుపై కేరళ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. అందరికీ న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే రాజకీయ నేతలు, మంత్రుల కార్లకు చలాన్‌లు జారీచేయడం లేదని అనేకమంది ఫిర్యాదు చేస్తున్నారు. తల్లితండ్రులు తన కుమార్తె లేదా కుమారుడితో బైక్‌పై ప్రయాణం చేసినా ఈ కెమెరాలు ట్రిపుల్ రైడింగ్‌గా నమోదు చేసి చలాన్‌లు విధిస్తున్నాయని మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అత్యాధునిక కెమెరాలు డ్రైవింగ్‌ చేస్తునప్పుడు ఫోన్‌ వినియోగించడం లేదా కారులో సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండా ప్రయాణించడం, అనధికారిక పార్కింగ్‌, సిగ్నల్‌ వ్యవస్థను పట్టించుకోకుండా డ్రైవింగ్‌ చేయడం వంటి తప్పులను గుర్తించి చలాన్‌లు విధిస్తోంది. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే రూ.500, బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తే రూ.1000, డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఫోన్‌ వినియోగిస్తే రూ.2000 జరిమానా విధిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 12, 2023, 19:05 [IST]
English summary
Kerala artificial intelligence camera issued challans to a bike for over speeding 1240 km per hour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+