గిఫ్ట్‌ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్‌ గిఫ్ట్‌.. వైరల్‌ వీడియో చూసేయండి

సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌కి బాయ్‌ఫ్రెండ్‌ గిఫ్ట్‌ ఇవ్వడం లేదా భార్యకు(Bride Gifts Groom) భర్త బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. ప్రేమ మొదలైన కొత్తల్లో లేదంటే నూతన వధూవరుల మధ్య ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇక్కడ వరుడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది భార్య. అదిరిపోయే బైక్‌ను కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది.

కొత్తగా పెళ్లయిన జంట పెళ్లిళ్లలో ఒకరినొకరు సర్ ప్రైజ్ చేయడం ఈ రోజుల్లో ట్రెండింగ్‌గా మారింది. భాగస్వామికి సర్‌ప్రైజ్‌గా వారికి ఇష్టమైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరచడం మరపురాని ఆనందంగా నిలిచిపోతుంది. ఆ అపురూపమైన గిఫ్ట్‌ను అందుకున్న భాగస్వామి ముఖంలో సంభ్రమాశ్చర్యాలను ఎన్ని కోట్లిచ్చినా కొనుగోలు చేయలేరు. అలాంటి అరుదైన సంఘటన సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

Bride-Gifts-Royal-Enfield-Hunter-350-To-Groom

అయితే చాలా వివాహాల్లో వరుడు వధువుకు(Bride Gifts Groom Royal Enfield Hunter 350) బంగారు ఆభరణాలు లేదా వధువు ఇష్టపడే ఇతర వస్తువులను బహుమతిగా ఇస్తుంటాం. కానీ ఇక్కడ కాస్త డిఫరెంట్‌గా ఓ పెళ్లిలో వధువు వరుడికి కానుకగా ఇచ్చింది. వరుడికి ఇష్టమైన బైక్ కొని సర్‌ప్రైజ్ చేసింది. కేరళలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వీడియోను చూసినట్లయితే వరుడి కళ్లకు గంతలు కట్టి కుటుంబీకులు, స్నేహితులు బయటకు తీసుకువస్తారు. అతని బంధువులు, వధువు అక్కడ వేచి ఉంటారు. ఈ ఇంట్రెస్టింగ్‌ సంఘటనను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. బయటకు వచ్చాక వరుడి కళ్లకు గంతలు విప్పుతారు. అతని ఎదురుగా ఓ వస్తువుపై ఎర్రటి గుడ్డ కప్పి ఉండటాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు.

Bride-Gifts-Royal-Enfield-Hunter-350-To-Groom

ఎగ్జైట్‌మెంట్‌తో ఆ క్లాత్‌ను తీయగానే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350(Royal Enfield Hunter 350) బైక్‌ను చూసి ఒక్కసారి సర్‌ప్రైజ్‌కు గురై సంతోషంతో తన భార్యను కౌగిలించుకుంటాడు. ఈ సంఘటన తర్వాత నూతన వధూవరులు అలా కొత్త హంటర్‌ 350 బైక్‌పై రైడ్‌కు వెళ్తారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్ అవుతోంది.

Bride-Gifts-Royal-Enfield-Hunter-350-To-Groom

వీడియోలోని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 బైక్ విషయానికొస్తే.. భారత మార్కెట్లో ఈ బైక్‌ యూత్‌తో పాటు పెద్దవాళ్లకు కూడా ఫేవరెట్‌గా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా దీన్ని డిజైన్‌ చేశారు. బుల్లెట్‌(Royal Enfield Bullet), క్లాసిక్‌ 350(Royal Enfield Classic 350) కంటే ఎక్కువగా ఈ బైక్‌నే ఇష్టపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం దాని స్టైలిష్‌ లుక్ మరియు ఇందులోని అద్భుతమైన ఫీచర్లు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బైక్ ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో 349.34సీసీ ఇంజిన్‌ను అమర్చారు. బైక్ ఇంజిన్ 20.2 PS పవర్ మరియు 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. లీటర్‌కు 36 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

Bride-Gifts-Royal-Enfield-Hunter-350-To-Groom

ఈ బైక్ ధర విషయానికి వస్తే, ఈ వీడియోలో ఉన్న బైక్ కేరళలోని నీలంపూర్‌లో రిజిస్టర్ చేయబడింది. కేరళలో ఈ బైక్‌ ఆన్-రోడ్ ధర రూ. 2.11 లక్షలు ఉండొచ్చు. పెళ్లి కానుకగా తన భర్తకు భార్య రూ. 2.11 లక్షల విలువైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో వారి అన్యోన్య దాంపత్యం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లలో శుభాకాకంక్షలు తెలుపుతున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2024, 19:37 [IST]
English summary
Kerala bride surprise gift to groom royal enfield hunter 350 video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+