ఉద్యోగికి కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. ఈ గిఫ్ట్ ధర రూ. 50 లక్షలకు పైమాటే
సాధారణంగా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వడం, స్వీట్స్ ఇవ్వడం లేదా కొత్త బట్టలు పంపిణీ చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు అరుదుగా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు స్కూటర్ల వంటివి కూడా అందించడం గురించి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కేరళకు చెందిన ఓ కంపెనీ యజమాని తన దగ్గర పనిచేసిన ఉద్యోగికి ఏకంగా మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) కారునే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు కేరళ మొత్తంలో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కేరళకు చెందిన ఏకే షాజి అనే వ్యాపారవేత్త మైజీ పేరుతో డిజిటల్ రిటైల్ స్టోర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే తన సంస్థలో పనిచేసే చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సీఆర్ అనీష్‌కు ఏకే షాజీ 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ' (Mercedes-Benz GLA ) ను గిఫ్ట్‌గా అందించారు.

తన యజమాని అందించిన ఈ కారు విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన కారుని గిఫ్ట్‌గా పొందే సరికి ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ‘‘డియర్ అనీ గత 22 సంవత్సరాలుగా మీరు నాకు బలమైన సపోర్ట్ గా ఉన్నారు. మీరు మీ క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాపారవేత్త రాసారు.

ఉత్తర కేరళలో కోజికోడ్ జిల్లాకు చెందిన 'అనీష్' మైజీ కంపెనీ ఏర్పాటు చేయడాని కంటే ముందు నుంచే అనీష్, షాజితో కలిసి పనిచేస్తున్నారు. కంపెనీ మార్కెటింగ్, మెయింటనెన్స్, డెవలప్‌మెంట్ యూనిట్లలో అనీష్ నిర్విరామంగా పనిచేశారు. రెండేళ్ల క్రితం కూడా షాజి ఆరుగురు ఉద్యోగులకు కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఒక వ్యక్తి ఏకంగా 22 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వారి నిజాయితీ మరియు నిబద్ధతను తెలియజేస్తుంది. ఇలాంటి ఉద్యోగులను గుర్తించి కంపెనీ యొక్క యజమానులు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అందిస్తే వారు మరింత నిబద్దతతో మరియు నిజాయితీతో పనిచేస్తారు.

అనీష్ గిఫ్ట్ గా పొందిన కారు 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ 220డి' (Mercedes-Benz GLA 220D). ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చే మిడ్-స్పెక్ వేరియంట్. ఈ ఇంజన్ 192బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడి ఉంటుంది, కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ యొక్క చాలా కార్లు ఇంతకుముందు పూర్తిగా విదేశీ మార్కెట్ల నుండి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అయితే గత సంవత్సరంలో భారతదేశంలో కూడా అసెంబ్లింగ్ ప్రారంభమయ్యింది. కావున ఇప్పుడు బెంజ్ కొనుగోలుదారులు సులభంగా తమకు నచ్చిన మరియు అందుబాటులో కార్లను కొనుగోలు చేయవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ కొత్త వెర్షన్ 30 మిమీ అదనపు పొడవు మరియు 104 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో అప్‌డేట్ చేయబడిన గ్రిల్ డిజైన్, రీడిజైన్ చేయబడిన బంపర్, భారీ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్డ్, అగ్రెసివ్ ట్విన్ ఎగ్జాస్ట్ మరియు ఆకర్షణీయమైన బ్యాడ్జ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త లగ్జరీ కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో భాగంగానే మై కనెక్ట్ కార్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. GLA SUV కొత్త MFA-2 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. మెర్సిడెస్ యొక్క ఇతర కాంపాక్ట్ మోడల్స్ అయిన A-క్లాస్ వంటివి కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ Mercedes-Benz GLA SUV మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది.
కొత్త మెర్సిడెస్ బెంజ్ SUV ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు వేర్వేరు స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. GLA SUVలోని సెంటర్ కన్సోల్‌లో టచ్‌ప్యాడ్ మరియు ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. కొత్త SUV క్యాబిన్‌కి ప్రీమియం అనుభూతిని అందించడానికి ఇంటీరియర్‌లో క్లైమేట్ కంట్రోల్ మరియు ఏసీ వెంట్స్ ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ SUV బిఎండబ్ల్యు ఎక్స్1, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, ఆడి క్యూ3 మరియు వోల్వో XC40 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








