బాబీ చెమ్మనూర్ కొన్న ల్యాండ్ రోవర్ ఇదే!.. ఫోటోలు
బాబీ చెమ్మనూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే కేరళలో చెప్పుకోదగ్గ ఆటో ప్రియులలో ఈయన ఒకరు. ఖరీదైన కార్లలో సామాన్యులు కూడా ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో రోల్స్ రాయిస్ కారును కూడా ట్యాక్సీగా మార్చారు. ఇప్పటికే ఈ కారు కేరళలో లేదా కేరళకు వెళ్లే వారు ఉపయోగించుకోవచ్చు. దీనికోసం కొంత చార్జెస్ కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు అన్యదేశ్య కార్లను కొనుగోలు చేసే బాబీ చెమ్మనూర్ ఇటీవల ఓ ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బాబీ చెమ్మనూర్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ కారు సెకండ్ హ్యాండ్ అని తెలుస్తోంది. దీనిని రాయల్ డ్రైవ్ నుంచి కొనుగోలు చేసారు. చూడటానికి కొత్త కారు మాదిరిగా కనిపిస్తున్న దీని ధర మరియు ఏ మోడల్ అనే వివరాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా కీర్తించబడుతున్న ఈ డిఫెండర్ కొనుగోలుతో బాబీ మళ్ళీ వార్తల్లో నిలిచారు.

డిఫెండర్ అనేది బ్రిటిష్ కార్ల తయారీదారు ల్యాండ్ రోవర్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. ఇది డిఫెండర్ 90 మరియు 110 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి రెండూ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 3.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.
డిఫెండర్ యొక్క 3.0లీటర్ డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 296 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిఫెండర్ 5.0లీటర్ వీ8 ఇంజిన్ ఆప్షన్ కూడా పొందుతుంది. అది 517 Bhp పవర్ మరియు 625 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరును అందిస్తాయి.

డిఫెండర్ అనేది జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క డీ7ఎక్స్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. కాబట్టి ఇది తేలికపాటి అల్యూమినియం మోనోకోక్ ఛాసిస్ పొందుతుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉన్న ఈ కారు 5028 మిమీ పొడవు, 2105 మిమీ వెడల్పు, 1967 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 3022 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు యొక్క జీలాండ్ క్లియరెన్స్ 218 మిమీ కావడం గమనార్హం.
అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా కారు గురించి కావలసిన సమాచారం అందించడానికి ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇందులో మెమరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి.
భారతీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు ధర రూ. 2 కోట్లు వరకు ఉంటుంది. ఇది అత్యాధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే పలువురు సినీతారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా తమ గ్యారేజిలో ఈ కారును చేర్చారు. ఇప్పుడు బాబీ చెమ్మనూర్ కూడా తన గ్యారేజిలో డిఫెండర్ కారును చేర్చారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








