ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ రూ. 25 లక్షల కారు కొన్న యువ జంట.. వీడియో వైరల్!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా క్షణాల్లో వైరల్ అవుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కంటెట్ క్రియేట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రమోషన్స్, ఇతర రెవెన్యూలతో ఫేమ్‌తో పాటు డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది దీనిని పార్ట్‌టైమ్ జాబ్‌గా చేస్తుంటే మరికొందరు, వ్లాగ్స్ చేస్తూ ఫుల్ టైమ్ కంటెంట్‌ని అందిస్తున్నారు. చాలా మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే ఆదాయంతో బతికేస్తున్నారు. సెలెబ్రిటీలు సైతం పర్సనల్ వ్లాగ్స్, వంటలు, ఇతర ఢిఫరెంట్ కంటెంట్‌తో అలరిస్తున్నారు. డబ్బుకి డబ్బు పేరుకి పేరు అన్నట్లు కొంతమంది సోషల్ మీడియా క్రియేటర్స్ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో రోజుకు పదుల సంఖ్యలో కొత్త క్రియేటర్స్ పుట్టుకొస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమ్‌ని కలిగి ఉన్న కేరళ జంట (శీతల్ ఎల్జా, విను వినేశ్) కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ జంట కేరళలో పాపులారిటీని కలిగి ఉన్నారు. 2021లో వీరు వివాహం జరిగింది. ఈ ఏడాది వీరికి ఓ పాప కూడా జన్మించింది. తాజాగా ఈ జంట కొత్తగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

కారు డెలివరీ తీసుకునే సమయంలో శీతల్ ఎల్జా భర్త వినేశ్ కారు బ్లాక్ కలర్‌ల్‌కి సరిపోయేలా షోరూమ్‌కు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. ఆ తర్వాత కవర్‌ని ఢిఫరెంట్ సైగలతో తీశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ముందుగా కారులోకి వెళ్లిన వినేశ్ ఆ తర్వాత శీతల్ చేతిని పట్టుకు మొదటిసారి ఎక్స్‌యూవీ 700లోకి ఆహ్వానిస్తాడు. కారు నడుపుతూ షోరూమ్ నుంచి బయటకు వచ్చారు.
అనంతరం చర్చికి తీసుకెళ్లి చిన్నారితో కలిసి చిన్న ప్రార్థనలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరు ఎడిట్ చేసిన పోస్ట్ చేసిన వీడియోకి వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. దీంతో మరోసారి ఈ జంట ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యారు. ఈ మధ్య సెలెబ్రిటీలు కొనుగోలు కార్లకు సంబంధించిన ప్రతీ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుంది. తాజాగా ఈ జంట సోషల్ మీడియాలో మెరిశారు.

ప్రస్తుతం మహీంద్రా XUV 700 ధర రూ .14 లక్షల నుండి రూ .25.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 మిడ్‌నైట్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, నాపోలీ బ్లాక్, డాజ్లింగ్ సిల్వర్, రెడ్‌రోజ్, ఎవరెస్ట్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు టయోటా ఫార్చ్యూనర్‌కి గట్టి పోటీని ఇస్తుంది. దీని వెయిటింగ్ పీరియడ్ సంవత్సరానికి పైనే ఉంది.
ఇటీవలె మహీంద్రా కార్లకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాల్లోనూ 5 స్టార్ రేటింగ్‌ని సాధిస్తున్నాయి. తాజాగా మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మెరిశాయి. ప్రస్తుతం సేల్స్ పరంగా నెలకు సగటున 7,000 నుంచి 8,000 మంది ఎక్స్‌యూవీ 700 SUVని కొనుగోలు చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








