లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉందనే విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిని ఈ లాక్ డౌన్ కి మద్దతుగా ప్రజలందరూ ఇంటిదగ్గరే ఉండాలని అధికారులు కోరారు. ఈ విధంగా ఉండటం వల్ల ప్రజల మధ్య సామాజిక దూరం తగ్గించబడుతుంది.

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

లాక్ డౌన్ లో భాగంగా పాఠశాలలు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ వంటి అన్నింటిని మూసివేయడం జరిగింది. రవాణా సదుపాయాలయిన బస్సులు, ట్రైన్లు, విమాన సేవలు మరియు మెట్రో వంటి వన్నీ నిలిపివేయబడ్డాయి. ఈ కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు.

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ దీనిని కేరళకు చెందిన ఒక స్థానికి నాయకుడు దిక్కరించడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

ఈ సంఘటనను మాత్రుభూమి న్యూస్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ కరోనా వైరస్ బారిన పడిన రాష్ట్రాలలో కేరళ ఒకటి మరియు పరిస్థితిని అదుపులో ఉంచడానికి ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకుంది. తమ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చూసేందుకు పోలీసు అధికారులు వీధుల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు మరియు అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

నివేదిక ప్రకారం తిరువనంతపురంలోని వర్కలాలో ఈ సంఘటన జరిగింది, అక్కడ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి, ఎందుకు బయటికి వచ్చారని అడిగారు. దానికి అతను సరైన సమాధానం ఇవ్వలేదు.

పోలీసు అధికారులు వెంటనే ఆ నాయకుడిని వారితో తీసుకెళ్ళి, లాక్ డౌన్ ధిక్కరించినందుకు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా వాహనం నడుపుతున్నప్పుడు ఇతడు హెల్మెట్ కూడా ధరించలేదు.

భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ప్రజలు బయటకు రాకుండా ఉండటానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. లాక్ డౌన్ మన మంచి కోసమే అని అందరూ ఇంట్లోనే ఉండాలి.

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎస్ఎఫ్ఐ లీడర్, తర్వాత ఏంజరిగిందంటే..?

అత్యవసర పరిస్థితి కారణంగా ఎవరైనా బయటకు వెళ్ళవలసి వస్తే, వారు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించడం వంటి అన్ని నియమాలను పాటించాలి. అంతే కాకుండా సామాజిక దూరం కూడా పాటించాలి. బయటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా మాస్కులు వంటివి ధరించి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలి.

Source: Mathrubhumi News/YouTube

More from DriveSpark

Article Published On: Wednesday, April 1, 2020, 14:07 [IST]
English summary
Politician BUSTED for defying Corona Virus lockdown [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+