చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

కొంతమంది వ్యక్తులు ఇతరుల నుంచి ఏమైనా ఆశించి, వాటిని బలవంతంగా పొందటానికి కిడ్నాప్ వంటివి చేస్తుంటారు. ఇటువంటి కిడ్నాప్ కి సంబంధించిన చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటనల్లో పోలీసులు ఎంతో సాహసాన్ని ప్రదర్శించి కిడ్నాప్ అయిన వ్యక్తులను కాపాడుతుంటారు.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

ఇటీవల కిడ్నాప్ అయిన ఒక వ్యాపారవేత్తను కర్ణాటక మరియు కేరళ పోలీసులు సంయుక్తంగా కలిగి అతనిని రక్షించారు. దీని కోసం పోలీసులు ఒక ట్రక్కును రోడ్డుపై ఆపి కిడ్నాప్ అయిన వ్యక్తిని గుర్తించడానికి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాహనాన్ని గుర్తించి ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

నివేదికల ప్రకారం కిడ్నాప్ జరిగిన 16 గంటల్లోనే వ్యాపారిని పోలీసులు రక్షించారు. మలప్పురంలో నివాసం ఉండే అన్వర్ అనే 35 ఏళ్ల వ్యక్తిని నలుగురు కిడ్నాపర్ల ముఠా కాసర్‌గోడ్ జిల్లా ఉడుమలోని లాడ్జి నుండి కిడ్నాప్ చేశారు. దీని గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కర్ణాటక పోలీసుల సహాయంతో వ్యవహరించారు.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

ఆజాద్ అన్వర్ తన యజమాని కరీపూర్‌లో నివాసముంటున్న మరియు ఎరువుల కంపెనీని నిర్వహిస్తున్న నాజర్‌తో కలిసి ఉడుమాను సందర్శించాడని పోలీసులు తెలిపారు. వారు జిల్లాలోని బార్బర్‌షాప్‌ల నుండి జుట్టును సేకరిస్తారు, వీటిని ఎరువుల కోసం ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

ఇద్దరూ ఒక లాడ్జిలో ఉన్నారు. కొంతమంది వారి వద్ద చాలా డబ్బు ఉందని భావించి, లాడ్జిలోని ఒక వ్యక్తి సహాయంతో వారిని కిడ్నాప్ చేయదలచారు. అయితే ఇందులో నాజర్ తప్పించుకోగా, అన్వర్‌ను పట్టుబడిపోయాడు.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

వారి వద్ద డబ్బు లేదని గ్రహిచిన కిడ్నాపర్లు 2 లక్షలు ఇవ్వాలని చెప్పారు. దీనికోసం అన్వర్ మొబైల్ ఫోన్‌తో వెంటనే అతని భార్యకు ఫోన్ చేయమని చెప్పారు. అన్వర్ భార్య కాసరగోడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి పోలీసులు మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఈ ప్రక్రియలో వీరి మొబైల్ ఫోన్స్ వల్ల పోలీసులు వారు ఎక్కడ ఉన్నారో అన్న సంగతి తెలుసుకున్నారు.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

కిడ్నాప్ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నాజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. మంగళూరులో కిడ్నాపర్‌లను పోలీసులు కనుగొన్నారు. కాసర్‌గోడ్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్స్ చేసి మంగళూరు పోలీసులు కిడ్నాపర్‌లను పట్టుకోవడానికి పలు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు.

కిడ్నాపర్లు కిడ్నాప్ చేయడానికి హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా కారుని వినియోగించారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఎక్కువ చోట్ల మోహరించారు. అయితే ఇక లాభం లేదని తెలుసుకున్న పోలీసులు ఒక ట్రక్కుని రోడ్డుకి అడ్డంగా నిలిపారు. ఆ సమయంలో హ్యుందాయ్ క్రెటా అక్కడకు వస్తుంది.

చాకచక్యంగా కిడ్నాపర్ల నుంచి వ్యక్తిని కాపాడిన పోలీసులు [వీడియో]

అక్కడకు వచ్చిన అక్కడే యు టర్న్ తీసుకోవడానికి ప్రయత్నించింది. దీనిని మీరు వీడియోలో గమనించవచ్చు. కారు వేగాన్ని తగ్గించినప్పుడు, ఒక పోలీసు అధికారి కారు వెనుక డోర్ ఓపెన్ చేయగానే కిడ్నాప్ అయిన వ్యక్తి క్షణకాలంలో బయటకు వచేసాడు. అయితే ఆ కిడ్నాపర్లు ఆప్పుడు పోలీసులు నుంచి తప్పించుకుని ముందుకు వెళ్లారు. పోలీసులు కూడా వారిని ఏ మాత్రం వదిలిపెట్టకుండా వెంబడించారు.

Most Read Articles

English summary
Kerala Cops Rescues Kidnapped Businessman By Joint Operation. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X