2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కార్ విభాగంలో లంబోర్ఘిని కూడా ఒకటి. ఈ లంబోర్ఘిని కారు కొనడం చాలా మంది కల కావచ్చు. కానీ ఆ కల చాలా తక్కువమందికి మాత్రమే నెరవేరుతుంది. మరికొందరు కొన్ని లక్కీ డ్రా లలో గెలుచుకుని అదృష్టవంతులు అవుతారు. ఇదే రీతిలో ఒక భారతీయునికి ఒక డ్రాలో లంబోర్ఘిని కారు వరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

భారతదేశానికి చెందిన శిబు పాల్ గత సంవత్సరం భారతదేశం నుండి యుకెకు వెళ్లారు. అతను ఇటీవల లంబోర్ఘిని ఉరుస్ కారుని మరియు 2 లక్షల రూపాయల నగదును గెలుచుకున్నాడు.

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

నాటింగ్‌హామ్ సిటీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న 28 ఏళ్ల లిన్నెట్ జోసెఫ్‌ను వివాహం చేసుకోవడానికి 32 ఏళ్ల శిబు పాల్ 2019 లో యూకే వెళ్లారు. ఇటీవల కరోనా మహమ్మరి కారణంగా అతను ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు. శిబు ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే కాకుండా ఖాళీగా ఉన్నందుకు అనేక కంపెనీలకు ఇమెయిల్ చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో జూలై 7 న, అతను BOTB డ్రీం కార్ పోటీలో గెలిచాడని మరియు ఒక సరికొత్త లంబోర్ఘిని ఉరుస్ అతని కోసం ఎదురు చూస్తోందని తెలిసింది.

MOST READ:మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

లంబోర్ఘిని ఉరుస్ ధర UK లో $ 195,000 ఖర్చు అవుతుంది. దీని ధర భారతదేశంలో సుమారు రూ. 1.8 కోట్ల రూపాయలు. ఈ కారుకి భారతదేశంలో టాక్స్ కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇంత ఖరీదైన లగ్జరీ కారు తన సొంతం అవుతుంది అంటే శిబు నమ్మలేకపోయాడు. అంతే కాకుండా అతను ఒక బాటిల్ బబ్లి మరియు € 20,000 నగదును గెలుచుకున్నాడు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా 2 లక్షల రూపాయలు.

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

ఈ భారతీయ దంపతులు ప్రస్తుతం టయోటా యారిస్‌ కారుని కలిగి ఉన్నారు మరియు కొత్త లంబోర్ఘిని కారు గెలుపొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శిబు నాటింగ్హంషైర్ లైవ్ లో మాటాడుతూ,

నేను ఇంత ఖరీదైన కారును ఉపయోగిస్తానని ఊహించలేదు. కరోనావైరస్ కారణంగా, ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఆ సమయంలో ఉద్యోగం కోసం చాలా ఇమెయిల్స్ పంపుతూ ఉన్నాను. ఈ విధంగా పంపుతున్నప్పుడు లక్కీ డ్రాలో ఇది సొంతమైంది. నేను ఒక లంబోర్ఘిని కారుని ఎప్పుడూ తాకలేదు అని కూడా తెలిపాడు.

MOST READ:అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన డబ్బు ఈ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లంబోర్ఘిని లారు గెలుపొందిన విషయం నాకు శిబు చెప్పినప్పుడు నైట్ షిఫ్ట్ నుండి తిరిగి వచ్చానని, వార్తలు వచ్చినప్పుడు నిద్రపోతున్నానని అతని భార్య తెలిపింది.

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (BOTB) అనేది యుకెలో డ్రీమ్ కార్ మరియు లైఫ్ స్టైల్ కి సంబంధించిన పోటీ. ఇది మొదట 1999 లో ప్రారంభమైంది. ఈ పోటీలో మీరు ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు. యుఎఇలో కూడా ఇలాంటి పోటీని ఆడటం ద్వారా ఖరీదైన కార్లను గెలుచుకున్న భారతీయులు చాలా మంది ఉన్నారు.

MOST READ:ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో పానరోమిక్ సన్‌రూఫ్, ఆరు సీట్లు

2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

లంబోర్ఘిని ఉరుస్ ఇటాలియన్ బ్రాండ్ నుండి వచ్చిన ఆధునిక ఆధునిక SUV. ఇది బ్రాండ్ నుండి వేగంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి ఈ లంబోర్ఘిని ఉరుస్. భారతదేశంలో కూడా ఉరుస్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ లంబోర్ఘిని ఉరుస్ మోడల్‌ను కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. భారతదేశంలో ఉరుస్ ధర రూ. 3.1 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 4 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

Image Courtesy: BOTB/YouTube

Most Read Articles

English summary
Jobless Indian wins 2 crore Lamborghini Urus & 2 lakh in cash. Read in Telugu.
Story first published: Friday, July 10, 2020, 19:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X