కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

సాధారణంగా చాలామంది కుక్కలు, పిల్లులు మరియు చిన్న చిన్న జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇవి వారితో ఎంతగా కలిసిపోతాయంటే అవి వారి జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. అంతలా ప్రేమించే వారు ఉన్నారు, అదే విధంగా మూగజీవాలను హింసించి రాక్షసానందం పోనే వారు కూడా ఉన్నారు.

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఇటీవల కేరళ పోలీసులు ఒక కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఈ డ్రైవర్ ఒక కుక్కను కారు వెనుక భాగానికి ఒక దారంతో కట్టి దాదాపు రెండు కిలోమీటర్లు లాగుతూ అతని క్రూర ప్రవర్తనను చూపించాడు. ఈ వీడియో చూసిన తరువాత కేరళ పోలీసులు ఈ వ్యక్తిని అరెస్టు చేశారు, అంతే కాకుండా అతని కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

కేరళలోని ఎర్నాకల్‌లో ఉదయం 11 గంటల సమయంలో బైక్ డ్రైవర్ కుక్కను కారును దూరం నుండి వెంబడించడం చూసాడు. అసలు ఏమి జరిగిందో అని అతడు దగ్గరకు వెళ్లి పరిశీలించగా ఆ కుక్కకు తాడు కట్టి ఇంకొక వైపు కారుకి కట్టి ఉండటం చూసాడు. ఆ కారు కుక్కని దాదాపు రెండు కిలోమీటర్ల వరకు లాగుతూ వెళ్ళింది. బైక్ డ్రైవర్ సుమారు 2 కిలోమీటర్ల దూరం వెంబడించి కారును ఆపడానికి ప్రయత్నించాడు.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లయితే కుక్కకు గాయాలై రక్తస్రావం లో మూలుగుతోంది. కొద్దిసేపటి తరువాత బైక్ డ్రైవర్ కారును ఆపగలిగాడు. బైక్ డ్రైవర్ కారు నుండి కుక్కను రక్షించాడు. అయితే కుక్క పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆ కార్ డ్రైవర్ తప్పించుకున్నాడు.

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

నివేదికల ప్రకారం కేరళ పోలీసులు కారు యజమానిపై ఆటోమేటిక్ కేసు పెట్టారు. కారు డ్రైవర్ పేరు యూసుఫ్ అని నివేదించబడింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 428, 429 ప్రకారం డ్రైవర్‌పై కేసు విధించారు. ఒక ఎన్జీఓ కూడా డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు.

MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఈ వీడియోను బైక్ డ్రైవర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీని తరువాత వీడియో పోలీసులకు చేరుకుంది. వీడియోలో చూస్తున్న కారు కమర్షియల్ వెహికల్ మరియు టాక్సీగా ఉపయోగిస్తారు. అయితే కారు డ్రైవర్ ఎందుకు ఇలాంటి నీచమైన చర్య చేసాడో తెలియదు.

సోషల్ మీడియాలో చాలామంది ప్రేక్షకులు ఈ కార్ డ్రైవర్ పై చాలా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జంతు క్రూరత్వానికి కఠినమైన శిక్షలు విధించాలి. కానీ ఆ వ్యక్తికి చిన్న జరిమానా చెల్లించడం ద్వారా మినహాయింపు ఇవ్వవచ్చు. మూగ జీవుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన ఇతనికి కఠినమైన శిక్ష విధించాలి.

MOST READ:హోండా సిడి 110 బైక్ కొనుగోలుపై ఇప్పుడు 5000 ఆదా చేసే అవకాశం.. ఎలాగో తెలుసా ?

కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఈ సంఘటనపై కుక్కకు సంఘీభావం తెలుపుతూ కేరళ పోలీసులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఈ తరహా సంఘటన ఇంతకు ముందు చాలాసార్లు వెలుగులోకి వచ్చింది.

కుక్కపిల్లలను అనవసరంగా కొట్టడం, వాటిని బాధించడం. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా అలాంటి ఏదైనా సంఘటనను చూసినట్లయితే, వెంటనే బాధ్యతాయుతమైన అధికారులకు సమాచారం ఇవ్వండి మరియు తప్పు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయండి, తద్వారా భవిష్యత్తులో ప్రజలు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kerala Driver Drags Dog For 2Km, Arrested. Read in Telugu.
Story first published: Saturday, December 12, 2020, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X