కేరళలో భారతదేశపు తొలి సీప్లేన్ టూరిస్ట సర్వీస్

By Ravi

విదేశాలకు మాత్రమే పరిమితమైన నీటిపై తేలియాడే విమానాలు ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ నేలపై ల్యాండిగ్/టేకాఫ్ విమానలను చూసిన భారతీయులు ఇకపై నీటిపై టేకాఫ్/ల్యాండిగ్ అయ్యే విమానాలను కూడా చూడొచ్చు. అయితే, ఈ విచిత్రాన్ని చూడాలంటే మనం కేరళకు వెళ్లాల్సి ఉంటుంది.

భారతదేశంలోనే తొలి సీప్లేన్ టూరిస్ట్ సర్వీసులను కేరళ ప్రారంభించింది. యావత్ భారతదేశం నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న కేరళలో ఇప్పుడు ఈ సీప్లేనే టూరిస్ట్ సర్వీసులు మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కేరళ ముఖ్యమంత్రి ఒమ్మెన్ ఛాండీ ఈ స్లీపేన్ టూరిస్ట్ సర్వీసులను గడచిన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.సి. వేణుగోపాల్, రాష్ట్ర పర్యాటక మంత్రి ఏ.పి. అనీల్ కుమార్ మరియు కేరళ ఎమ్.పి. పీతాంబర కురూప్‌లు హాజరయ్యారు. ఈ సీప్లేన్ సర్వీసులకు బ్యాక్‌వాటర్స్‌కు నెలవైన కేరళ ఎంతో అనువైన ప్రదేశం. వీటి సాయంతో పక్షి మాదిరిగా గాలిలో నుంచి కేరళ అందాలను తిలకించడమే కాకుండా, ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించే దూరం కూడా తగ్గుతుంది. మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సీటింగ్ సామర్ధ్యం

సీటింగ్ సామర్ధ్యం

సెస్నా 206 సీప్లేన్‌లో ఆరుగురికి చోటు ఉంటుంది.

సర్వీస్ ఏరియా

సర్వీస్ ఏరియా

ప్రస్తుతం సెస్నా 206 సీప్లేన్ సర్వీసులను అష్టముడి లేక్ మరియు అలప్పుళలోని పున్నమడ మధ్య ప్రారంభించారు.

ప్రారంభం

ప్రారంభం

గడచిన ఆదివారం ఈ సెస్నా 206 సీప్లేన్ సర్వీసును ప్రారంభించారు.

వాతావరణ ఆటంకం

వాతావరణ ఆటంకం

సెస్నా 206 సీప్లేన్ సర్వీస్ ప్రారంభోత్సవం నాడు వాతావరణం అనుకూలించకపోవటంతో టేకాఫ్‌ను కొంత దూరానికి పరిమితం చేశారు.

మత్స్యకారుల నిరసన

మత్స్యకారుల నిరసన

సెస్నా 206 సీప్లేన్ సర్వీసులు తమ జీవనాధారాన్ని, జీవావరణాన్ని దెబ్బతీస్తుందని స్థానిక మత్స్యకారులు నిరసన చేస్తున్నారు.

బెల్జియన్ కెప్టెన్

బెల్జియన్ కెప్టెన్

ఈ సెస్నా 206 సీప్లేన్‌ను బెల్జియాకు చెందిన కెప్టెన్ మైఖేల్ పాబ్రై సారధ్యం వహిస్తున్నాడు.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2013, 11:22 [IST]
English summary
On Sunday Kerala became the first Indian state to offer seaplane service targeted at tourists. The service was inaugurated by Chief Minister Oommen Chandy, along with Union Minister of state for Civil Aviation K.C. Venugopal, state Tourism Minister A.P. Anil Kumar and Peethambara Kurup, MP.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+