'భారత్' నంబర్ ప్లేట్‌ ద్వారా ఏటా రూ. 300 కోట్ల నష్టం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలో ప్రతి వాహనానికి నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి. రాష్ట్రాన్ని బట్టి, వాహన రకాన్ని బట్టి రవాణా శాఖ ఆయా వాహనాలకు నంబర్‌ ప్లేట్లను కేటాయిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా BH అనే పేరుతో నంబర్‌ ప్లేట్లను చూశారా.. బహుళ రాష్ట్రాల్లో పని చేయాల్సిన వారికి వేర్వేరు వాహనాల రిజిస్ట్రేషన్‌ల వల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి కేంద్రం అందించిన వ్యవస్థ BH నంబర్‌ ప్లేట్‌.

భారత్‌లో రవాణా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధాన ప్రాతిపదికన నిర్వహిస్తాయనే విషయం తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని నియంత్రిస్తాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నంబర్‌ ప్లేట్‌లు జారీ చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

Kerala-BH-Series-Number-Plate

ఈ క్రమంలో ఇప్పుడు కేరళ ప్రభుత్వం BH నంబర్ ప్లేట్‌కు వ్యతిరేకంగా ఉంది. BH నంబర్‌ ప్లేట్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ. 300 కోట్ల నష్టం వాటిల్లుతుందని భావిస్తోంది. అయితే రోడ్డు పన్నును నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే కాబట్టి, కేంద్రం నిర్ణయించిన తక్కువ రేటును అనుమతించలేమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా BH సిరీస్‌తో వాహనం రిజిస్టర్ అయినట్లయితే, వాహనదారులు రెండేళ్ల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఒక రాష్ట్రంలో రిజిస్టరైన వాహనం మరో రాష్ట్రంలో ఆరు నెలలకు మించి వినియోగిస్తే ఆ రాష్ట్రానికి రిజిస్ట్రేషన్‌ను బదిలీ చేసి పన్ను చెల్లించాలని చట్టం చెబుతోంది.

Kerala-BH-Series-Number-Plate

రాష్ట్రంలో వాహన ధరలలో 21 శాతం GST కింద ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో భారత్‌ నంబర్ ప్లేట్‌ సిరీస్‌ కోసం 8 నుంచి 12 శాతం కట్‌ అవుతుంది. దీని ద్వారా ఏటా తమకు రూ. 300 కోట్ల నష్టం వాటిల్లుతుందని కేరళ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది.

అయితే BH నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ఇందుకోసం వాహనదారులు RTO కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు, డీలర్ కార్ కొనుగోలుదారు తరపున వాహన పోర్టల్‌లో ఫారం 20ని ఉపయోగించి ఆన్‌లైన్ దరఖాస్తును చేస్తారు. వాహన రిజిస్ట్రేషన్ కోసం సిరీస్ రకాన్ని భారత్ సిరీస్ లేదా BH సిరీస్‌గా డీలర్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

Kerala-BH-Series-Number-Plate

కాగా వాహన పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును నింపేటప్పుడు డీలర్.. కారు కొనుగోలుదారు కోసం వర్కింగ్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసేటప్పుడు.. వాహనదారుడి వర్కింగ్ సర్టిఫికేట్ పత్రాలతో ఫారం 60 లేదా అధికారిక గుర్తింపు కార్డును కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా డీలర్ ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

వాహన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత, అవసరమైన రుసుము లేదా మోటారు వాహన పన్నును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అయితే BH సిరీస్ రిజిస్ట్రేషన్ ప్లేట్ పొందడానికి వాహన యజమాని ప్రారంభంలో రెండేళ్లపాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్ల వన్‌టైమ్ ట్యాక్స్‌కు బదులుగా, రెండేళ్లలోపు పన్ను చెల్లించవచ్చు.

Kerala-BH-Series-Number-Plate

సెప్టెంబర్ 15, 2021న కేంద్ర ప్రభుత్వం భారత్ రిజిస్ట్రేషన్, ఏకీకృత రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. B.H. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ప్రారంభంలో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే BH సిరీస్‌ నమోదుకు అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు రిజిస్టరైన వాహనాలను కూడా బీహెచ్‌గా మార్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

తమ వాహనాన్ని BH తో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తమ పని ప్రదేశం లేదా అడ్రస్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు తప్పనిసరిగా వర్క్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రాల్లో గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వినియోగించుకోవాలి.

దీని తర్వాత కూడా, వాహనాన్ని వేరే రాష్ట్రంలో ఉపయోగించాలంటే, 12 నెలల గడువు ముగిసేలోపు యజమాని ఆ రాష్ట్రంలో వాహనాన్ని మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనం రిజిస్టర్ చేయబడిన రాష్ట్రం నుండి NOC సర్టిఫికేట్ కూడా అవసరమని గమనించాలి. ఈ పరిస్థితులను నివారించడానికే కేంద్రం BH సిరీస్‌ను అమలు చేసింది. కొత్త సవరణ ప్రకారం, BH రిజిస్టర్డ్ వాహనాన్ని ఇతరులకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 29, 2024, 15:49 [IST]
English summary
Kerala government opposes bh number plate registration here are the reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+