ఇకపై వాహనాలకు మోడిఫికేషన్స్‌ చేస్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.. కీలక ఆదేశాలను జారీ చేసిన కేరళ హైకోర్టు

దేశంలో వాహనాలను మోడిఫై చేయడం చట్ట ప్రకారం నేరం. కానీ చాలా మంది తమ వాహనాలను తమకు నచ్చిన రీతిలో ఇతరుల దృష్టిని ఆకట్టుకునేలా పలు మోడిఫికేషన్లు చేస్తున్నారు. అయితే రోడ్డుపై ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందితో పాటు హాని కలిగించేలా వాహనాలకు(Modified Vehicles) మార్పులు చేయడం నిషేధం.

హెవీ లైటింగ్‌తో మెరిసే ఆఫ్టర్‌మార్కెట్(Modified vehicles aftermarket) లైట్లు, పరిమితికి మించిన శబ్ధంతో ఆఫ్టర్‌మార్కెట్ హారన్‌లు, ఇంకా శబ్ధ కాలుష్యాన్ని పెంచే సైలెన్సర్‌లు ఈ రోజుల్లో రోడ్లపై ప్రధాన సమస్యగా మారుతున్నాయి. అయితే ఇవన్నీ పాపులర్ కావడానికి ఓ రకంగా యూట్యూబ్ వ్లాగర్లు కూడా ఓ రకంగా కారణమనే చెప్పవచ్చు.

Kerala-High-Court-Orders-Against-Modified-Vehicles

ముఖ్యంగా చాలా మంది యూట్యూబర్‌(Modified Vehicles Youtube Channels)లు మోడిఫై చేసిన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వీడియోలను చూసే చాలా మంది తమ వాహనాలను సవరించాలనే ఆలోచనతో తమకు నచ్చినట్లుగా మోడిఫై చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై జరిమానాలు తప్ప పెద్దగా చర్యలు తీసుకోలేదు.

అయితే త్వరలోనే ఈ పరిస్థితి మారనుంది. తాజాగా కేరళ హైకోర్టు(Kerala High Court Orders On Modified Vehicles) జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు కారణమని చెప్పాలి. మోడిఫైడ్ వాహనాలకు కేరళ రాష్ట్రం ప్రసిద్ధి. ఎందుకంటే అక్కడివారు తమ వాహనాలను మోడిఫై చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు.

Kerala-High-Court-Orders-Against-Modified-Vehicles

ఇలా వాహనాలను మోడిఫై చేయడంతో ఇతర వాహనదారులతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుండటంతో పోలీసు శాఖ అధికారులు, ట్రాఫిక్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కేరళ హైకోర్టు ఇప్పుడు తీవ్ర ఆదేశాలు జారీ చేసింది. మోడిఫైడ్‌ వాహనాలు ఎక్కువ కావడానికి యూట్యూబర్లు కూడా ఓ కారణం కావడంతో దీనిపై సీరియస్‌గా ఉంది.

ఉత్తర్వుల ప్రకారం, మోడిఫైడ్ వాహనాలను ఉపయోగించే మరియు ప్రాచుర్యం పొందిన యూట్యూబర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ ICOR పోలీసు శాఖను ఆదేశించింది. యూట్యూబర్‌లపైనే కాకుండా మోడిఫైడ్ వాహనాలను కలిగి ఉన్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కేరళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాకుండా ప్రభుత్వ వాహనాల్లో మార్పులు చేసినా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ అజిత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలకు మార్పులు చేయడం ద్వారా ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది ఇది తీవ్రమైన నేరమని కోర్టు పేర్కొంది.

అందువల్ల వాహనాలకు చేసిన ఒక్కో సవరణ(Fine For Modified Vehicles)కు పాల్పడిన ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించాలని అధికారులను కేరళ కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది చట్టంలో ఇప్పటికే నిర్వచించిన శిక్షలకు అదనపు శిక్ష అని గుర్తించాలి.

ఓ రకంగా వాహన సవరణ అనేది ఒక ఆర్ట్‌ అనే చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. అయితే ఈ సవరణలు ఇతరుల ప్రాణాలకు ఆటంకం కలిగించకూడదు. కాబట్టి వాహనాలపై సవరణలు చేయకపోవడం బెటర్‌. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కేవలం కేరళలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 9, 2023, 20:32 [IST]
English summary
Kerala high court issued orders against modified vehicles here you all need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+