కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంధన ధరలు కేవలం రవాణా రంగాన్నే కాకుండా, ఇతర రంగాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో, ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తుండగా, కొందరు ఒత్సాహికులు మాత్రం తామే స్వయంగా ఈవీలను తయారు చేసుకుంటున్నారు.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

తాజాగా, కేరళకు చెందిన ఓ 67 ఏళ్ల వ్యక్తి తానే సొంతంగా ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేసుకున్నాడు. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు పెద్దలు మరియు ఇద్దరు చిన్నారులు హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారును నడపడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. కేవలం రూ.5 ల ఖర్చుతో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేసిన వ్యక్తి చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకు చెందిన ఆంటోనీ (67) అనే వ్యక్తి ఓ మినీ/మైక్రో ఎలక్ట్రిక్ కారును సృష్టించారు. ఆంథోనీ గతంలో తన ప్రయాణాల కోసం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ‌ను ఉపయోగించానని, దాని స్ఫూర్తి ఆధారంగానే ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేశానని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం తనకి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇవ్వలేదని, తాను వృత్తిరీత్యా రోజుకు కనీసం 30 కి.మీ లకు పైగా దూరం ప్రయాణిస్తానని, ఈ నేపథ్యంలో సౌకర్యవంతమైన రైడ్ కోసం తానే స్వయంగా ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూర ప్రయాణాలు చేసేందుకు తనకు శరీరం సహకరించలేదని, అందుకే ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేశానని ఆంథోనీ చెప్పారు. అయితే, తాను ఆశించిన ధరకు మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ మినీ/మైక్రో ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV), మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.12 లక్షల నుండి మొదలవుతుంది. అయితే, ఇంత డబ్బును చెల్లించే ఆర్థిక స్థోమత ఆంథోనికి లేదు. దీంతో తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. ఆ ఆలోచనలకు ఫలితమే, ప్రస్తుతం మీరు ఈ ఫొటోలు మరియు వీడియోలలో చూస్తున్న ఎలక్ట్రిక్ కారు. ఈ కారు తయారీ కోసం అంథోనీ సుమారు రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా తయారు చేయబడింది మరియు వాడుకలో ఉంది. ఆంథోనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారును తన పని కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం చూడటానికి మోడిఫైడ్ టాటా నానో కారు మాదిరిగా కనిపిస్తుంది. ఈ కారుకి ఆ డిజైన్‌ను కల్పించడం కోసం (బాడీ ప్యానెల్‌ల కోసం) బస్సు మరమ్మతు వర్క్‌షాప్ ను ఆశ్రయించాడు. ఈ వర్క్ షాప్ నుండి బాడీ ప్యానెళ్లను సేకరించాడు మరియు ఢిల్లీలోని ఓ డీలర్ నుంచి బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను కనుగోలు చేశాడు.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

ఆంథోనీకి ఎలక్ట్రిక్ వెహికల్ డెవలప్‌మెంట్‌లో అనుభవం లేకపోవడంతో మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. మొదట్లో అతను లోపభూయిష్టమైన బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారును కొనుగోలు చేసాడు. కానీ, తర్వాత వాటిని నాణ్యమైన వాటితో భర్తీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, ఈ కారును అభివృద్ధి చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని, ఇలా అనేక కష్టాల తర్వాత తన కోసం ఓ ఎలక్ట్రిక్ కారును విజయవంతంగా తయారు చేసుకోగలిగానని ఆంథోనీ చెప్పుకొచ్చారు.

కేవలం 5 రూపాయలకే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. కేరళైట్ అద్భుత సృష్టి!

ఆంథోనీ ఈ కారు అభివృద్ధి చేయడానికి మొత్తం రూ.4.5 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అయితే ఈ వాహనంలో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ముందు వరుసలో బెంచ్ సీట్ ఉంటుంది. అలాగే, వెనుక వరుసలో బ్యాక్‌రెస్ట్ లేని బెంచ్ ఉంటుంది, ఇందులో ఇద్దరు చిన్నారులు కూర్చునేంత స్థలం ఉంటుంది. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ కారు, అంటే, గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. కాబట్టి, దీనిని డ్రైవ్ చేయడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ వంటి అవసరం లేదు.

ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై 60 కి.మీ రేంజ్ ను అందించే బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తోంది. ఆంథోనీ తన ఆఫీసు రాకపోకల కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి అదనంగా, అతని వద్ద ఓ మారుతి సుజుకి ఆల్టో కారు కూడా ఉంది. తెలుగులో ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, April 11, 2022, 16:59 [IST]
English summary
Kerala man builds micro electric car runnig cost will be rs 5 for 60 km
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+