అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది.. అతి చేసి తిప్పలు పడకండి!
ప్రస్తుతం కొంత మంది తమ వాహనాలను రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. ఎదురుగా ఉన్న వాటిని, వెనుక వచ్చే వాటిని లెక్క చేయకుండా తమకు నచ్చినట్లుగా నిర్లక్ష్యంగా రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది వీటిని వీడియోలు తీస్తూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుండటంతో ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అయితే ముఖ్య విషయం ఏమిటంటే, కారు నడుపుతున్న డ్రైవర్ ఏకంగా ఎమర్జెన్సీగా వెళ్తున్న అంబులెన్స్‌కే అడ్డం వచ్చాడు. ప్రమాదం లేదా అనారోగ్య పరిస్థితుల్లో బాధితులను దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించడానికి అంబులెన్స్‌లు చాలా కీలకం. అందుకే ఇవి రోడ్లపై వెళ్తుంటే ఇతర వాహనాలను కూడా ఆపి మొదటగా దీన్ని పంపిస్తారు.
దీని సైరన్ వింటేనే అందరూ ప్రక్కకు తప్పుకుంటారు. అలాంటిది అంబులెన్స్‌కు దారివ్వకుండా నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై పోలీసులు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. రోడ్లపై తమకు ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేయడం వలన ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇతన్ని చూస్తే అర్థం అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, కేరళ రాష్ట్రంలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే చలకుడి మార్గంలో హడావుడిగా వెళ్తున్న అంబులెన్స్‌కు మారుతీ సుజుకీ సియాజ్ డ్రైవర్ తన కారును అంబులెన్స్‌కు అడ్డుగా వేగంగా డ్రైవింగ్ చేస్తూ దానికి దారీ ఇవ్వలేదు. ఎమర్జెన్సీగా వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ చాలా సార్లు హారన్ కొట్టినప్పటికి కూడా కారు డ్రైవర్ మాత్రం సైడ్ ఇవ్వలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కూడా అంబులెన్స్ డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డు అయింది. సాధారణంగా అంబులెన్స్ వస్తున్న సమయంలో రోడ్డుపై అందరూ కూడా ప్రక్కకు తప్పుకుంటారు. దూరం నుంచి దాని సైరన్ వినపడగానే అలర్ట్ అయి దానికి అడ్డుగా వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ మారుతీ సుజుకీ సియాజ్ డ్రైవర్ మాత్రం దాని సైరన్ సౌండ్ విని కూడా పక్కకు తప్పుకోలేదు.

పైగా దాని కంటే ముందు మరింత వేగంతో డ్రైవింగ్ చేశాడు. అంబులెన్స్ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సైడ్ ఇవ్వకుండా కారును అడ్డంగా పోనిస్తూనే ఉన్నాడు. అతను చేసిన ఈ పని మొత్తం కెమెరాలో రికార్డు కావడంతో ఇదంతా తెలిసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
కొంతమంది నెటిజన్లు ఆ కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో గురించి అందరి నోటా పడి చివరికి కేరళ పోలీసులకు చేరుకుంది. ఈ డ్రైవర్ చేసిన తతంగాన్ని చూసిన వారు కారు నెంబర్ ఆధారంగా ఓనర్‌తో పాటు డ్రైవింగ్ చేసిన వ్యక్తి వద్దకు చేరుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు.

అంబులెన్స్ వెళ్తున్న దారిలో దానికి సైడ్ ఇవ్వనందుకు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేనందుకు, అధికారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు, మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు వారికి రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ చేసిన వ్యక్తి లైసెన్స్‌ను రద్దు చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చాలా మంది నెటిజన్లు పోలీసులు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడం సరైన చర్యే అని పేర్కొంటుండగా, మరికొంత మంది అయితే ఏకంగా కారు రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేయాలని కామెంట్లు పెడుతున్నారు. పోలీసులు కారు ఓనర్ ఇంటి వద్దకు చేరుకుని జరిమానా విధిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను ఒక యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది కూడా తెగ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications








