ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

ఇటాలియన్ కార్ కంపెనీ లంబోర్ఘిని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన మరియు వేగవంతమైన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీలో ప్రసిద్ది చెందిన బ్రాండ్. చాలా మందికి లంబోర్ఘిని కార్ ఒక కలగానే మిగిలిపోతుంది. కనీసం ఒక్కసారైనా ఈ కారులో ప్రయాణించాలని కోరుకునే వారు కోట్ల సంఖ్యలోనే ఉంటారు.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇలాంటి కార్లను కొనుగోలు చేయలేని కస్టమర్లు తమ కార్లనే లంబోర్ఘిని కార్లుగా ఫీల్ అయి సంబరపడిపోతుంటారు. కొందరు ఔత్సాహికులు మాత్రం తమ పాత కార్లను సూపర్ కార్ల మాదిరిగా కనిపించేలా కస్టమైజ్ చేసుకుంటారు. కానీ, ఇతనైతే ఏకంగా చెత్తతోనే లంబోర్ఘినిలా కనిపించే ఓ సూపర్ కారును డిజైన్ చేసేశాడు.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

అరుణ్ స్మోకీ అనే ఓ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఇది వైరల్‌గా మారిపోయింది. చెత్త నుండి సేకరించిన ఆటోమొబైల్ విడిభాగాలతో ఈ 'చెత్త' లంబోర్ఘిని కారును డిజైన్ చేశాడు. అలాగని, ఇదేదో సరదా కోసం తయారు చేసిన పనికిరాను కారు మాత్రం కాదు.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

ఇది పూర్తి ఫంక్షనల్ కారు. ఒరిజినల్ లంబోర్ఘిని కార్లలో కనిపించినట్లుగా, ఈ కారు వెనుక భాగంలో ఇంజన్ ముందు భాగంలో బూట్ స్పేస్ ఉంటాయి. ఈ కారు పూర్తిగా నొక్కులుపోయిన బాడీని కలిగి ఉంటుంది. బాడీ కలర్‌కు పెయింట్ చేయడానికి బదులుగా గ్రీన్ కలర్ వినైల్ వ్రాప్‌ను ఉపయోగించారు.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

కారు ఇంటీరియర్స్‌లో కూడా గ్రీన్ కలర్ వ్రాప్‌ను ఉపయోగించారు. ఈ కారు పూర్తిగా చేతితో తయారు చేశారు. ఈ కారు ఎటు వైపు నుండి కూడా సున్నితంగా కనిపించడం లేదు మరియు దాని ఫినిషింగ్ కూడా లోపించింది. ఒరిజినల్ లంబోర్ఘిని కారుని, ఈ కారుని పక్కపక్కనే పెట్టి చూస్తే ఇందులోని వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తాయి.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

దీని ఎక్స్టీరియర్ బాడీ ప్యానెళ్లన్నీఫ్లెక్స్ బ్యానర్లను ఉపయోగించి తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులోని హెడ్‌లైట్, ఎయిర్ డక్ట్ అన్నీ కూడా చేతితో తయారు చేయబడినవే. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన అనాస్ అనే ఔత్సాహికుడు ఈ కారును తయారు చేశారు.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

అనాస్‌కు చిన్నప్పటి నుండి కార్లంటే అమితమైన ఆసక్తి. చాలా కాలంగా కారును నిర్మించాలని ప్లాన్ చేస్తున్న అనాస్ చివరిగా చెత్తతో ఈ కారును నిర్మించాడు. అనాస్ ఈ కారు ప్రతిరూపాన్ని తయారు చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు సాధారణంగా విసిరిపారేసే వస్తువులను రీసైకిల్ చేసి, పునర్వినియోగించడమే.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

వివిధ ఆటోమోటివ్ గ్యారేజ్ డంపింగ్ యార్డుల నుండి సేకరించిన విడిభాగాలను ఉపయోగించి అనాస్ ఈ కారును డిజైన్ చేశాడు. దీని ఫ్రేమ్ మరియు అల్లాయ్ వీల్స్‌ను సమీపంలోని గ్యారేజ్‌లో తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత అతను సమీపంలోని గ్యారేజ్ నుండి కొనుగోలు చేసిన పాత మారుతి 800 టైర్లను ఇందులో ఉపయోగించినట్లుగా వీడియోలో పేర్కొన్నారు.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

రియల్ వరల్డ్ లంబోర్ఘిని మాదిరిగానే, దీని ఇంజన్ కూడా వెనుక భాగంలో ఉంటుంది మరియు దానిపై క్లియర్ గ్లాస్ టాప్ కూడా అమర్చబడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారులో ఉపయోగించిన ఇంజన్‌ను హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ నుండి గ్రహించారు. ఫ్యూయెల్ ట్యాంక్‌ను ప్లాస్టిక్ క్యాన్‌తో తయారు చేశారు.

MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

ఈ కారులో అన్ని ఎలక్ట్రానికి పరికరాలకు వైరింగ్ చేయబడి ఉంటుంది. యూట్యూబ్‌లో వీడియోలు చూడటం ద్వారా తాను ఈ కారును సిద్ధం చేశానని అనాస్ తెలిపాడు. ఈ కారులో పవర్ విండో స్విచ్, మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ మరియు ఫ్రంట్ వ్యూ కెమెరా మరియు స్పీడో మీటర్ కూడా ఉన్నాయి.

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

అంతేకాకుండా, ఈ కారులో హ్యాండ్ మేడ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, దీనిని సెంటర్ కన్సోల్ మధ్యలో అమర్చారు. కారు లోపల డాష్‌బోర్డ్‌ను కూడా జంక్ మెటీరియల్స్‌తోనే తయారు చేశారు. సెంటర్ కన్సోల్‌లో అన్ని పరికరాలకు సంబంధించిన కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఈ కారులో నాలుగు ఫార్వాడ్ గేర్లతో పాటుగా ఒక రివర్స్ గేర్ కూడా ఉంది

ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

హీరో గ్లామర్ 125సిసి ఇంజన్‌తో పనిచేసే ఈ కారులో ఇద్దరికి మాత్రేమ చోటు ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కారు పైభాగంలో ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ కూడా ఉంది. ఈ లంబోర్ఘినీ కారు చెత్తతో తయారైనదే అయినప్పటికీ, అనాస్ ఆలోచనకు మాత్రం కుదోస్ అనక తప్పదు. మీరేమంటారు?

Most Read Articles

English summary
Kerala Man Made Lamborghini Replica Made From Scrap. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X